MLC Duvvada Srinisa Rao : ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. తాజాగా ఫోన్ కాల్ రికార్డు వెలుగులోకి వచ్చింది. విపరీతంగా చర్చకు దారి తీసింది. మాధురి అనే మహిళతో దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితంగా ఉంటున్నాడని భార్య వాణి ఆరోపించారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ధర్నా చేస్తున్నారు.అనేక మలుపులు, ట్విస్టులు కొనసాగుతున్నాయి. మరోవైపు వైసీపీ హై కమాండ్ ఈ ఘటనపై స్పందించింది. దువ్వాడ శ్రీనివాసును టెక్కలి ఇన్చార్జి బాధ్యతలు నుంచి తప్పించింది.అయితే ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా నిర్మించుకున్న ఇంటి పై రగడ నడుస్తోంది.ఆ ఇంటిని పిల్లల పేరిట రాయాలని దువ్వాడ వాణి తొలుతా డిమాండ్ చేశారు. అయితే అది తన స్వరార్జితం అని.. నా తరువాత పిల్లలకి అది వర్తిస్తుందని దువ్వాడ శ్రీనివాస్ తేల్చి చెప్పారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ కు ఇంటి నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చానని మాధురి చెబుతున్నారు. ఆ మొత్తం ఇచ్చి ఇంటిని స్వాధీనం చేసుకోవాలని ఆమె సూచించారు. టీవీల్లో ఈ ఘటన ప్రధాన అంశంగా మారింది. మొత్తం కుటుంబ సభ్యులంతా మీడియా డిబేట్లు, ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ మరింత రక్తి కట్టించారు. అటు మాధురి సైతం అదే స్థాయిలో స్పందించేవారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ వినోదాన్ని పంచింది. ఇటీవల కొత్త అంశాలు వెలుగులోకి రావడంతో.. దువ్వాడ ఎపిసోడ్ స్పీడ్ తగ్గింది.
* ఆత్మహత్యగా చెప్పు
అయితే తాజాగా మాధురితో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడిన వాయిస్ కాల్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఎపిసోడ్ కొనసాగుతుండగానే మాధురి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే మనస్తాపంతో తానే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు మాధురి అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా బయటపడిన వాయిస్ కాల్ లో మాత్రం అది ఆత్మహత్యాయత్నం కాదని.. ప్రమాదమని తేలడం విశేషం.
* ఆడియోలో స్పష్టంగా
మాధురి రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే ఆమెకు దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ చేశారు. ఫోన్లో మాట్లాడారు. మనస్థాపంతో తానే ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు మీడియాతో చెప్పాలని దువ్వాడ శ్రీనివాస్ చెప్పినట్టు ఆడియోలో స్పష్టంగా వినబడుతోంది. దువ్వాడ వాణి వల్లే తాను చనిపోతున్నానని మీడియా ముందు చెప్పాలని దువ్వాడ శ్రీనివాస్ ఆమెకు సూచించాడు.ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరోసారి దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ పై చర్చ నడుస్తోంది.
* ఎలా లీక్ అయింది
అయితే మాధురితో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ లో మాట్లాడారు. అది ఎలా లీక్ అయింది అన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా? మాధురి అందుకే దీనిని లీక్ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఫ్యామిలీ ఎపిసోడ్ లో దువ్వాడ శ్రీనివాస్ వెనక్కి తగ్గారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తన పరిస్థితి ఏంటని మాధురి ఆందోళనతోనే ఆడియోను లీక్ చేశారని అనుమానాలు వస్తున్నాయి. దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.
* వైసీపీ నుండి సస్పెండ్ చేయాలి
దువ్వాడ శ్రీనివాస్, మాధురి మధ్య జరిగిన ఫోన్ కాల్ ఆడియో వ్యవహారం బయటపడిన నేపథ్యంలో.. దువ్వాడ వాణి స్పందించారు. మీడియాతో మాట్లాడారు. దువ్వాడ శ్రీనివాసులు వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీను, ఆయన తల్లి, సోదరుడు తనపై కొట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తులు ఇంకా వైసీపీలో ఉండడం వల్ల పార్టీకి మరింత నష్టం తప్పదు అన్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Duvvada srinivas madhuris phone call recording leaked
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com