3D House: నేటి కాలంలో ఇల్లు కట్టుకోవడం అంటే గగనమే అని కొందరు భావిస్తుంటారు. ఎందుకంటే ఇల్లు నిర్మాణం కోసం ఉపయోగించే సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల వేతనాలు సైతం భారీగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న ఇల్లు నిర్మించాలని అనుకున్నా కనీసం రూ. 10 లక్షలు కావాల్సిందే. అదికూడా అనుకున్న సమయానికి పూర్తవుతుందో..? లేదో..? అన్న ఆందోళన ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 2 లక్షలకే 3D ఇల్లు పూర్తి అవుతుంది. అది కూడా 45 రోజుల్లో గృహప్రవేశం కూడా చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ త్రీడీ ఇళ్ల ప్రత్యేకత ఏంటి? దీనిని ఎలా నిర్మించుకోవాలి?
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి ఇల్లు నిర్మాణదారులకు తెలిసిన విషయమే. ఎందుకంటే కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి ఈ పథకం కింద కొంతవరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పథకం కింద పూర్తిగా ఇల్లును నిర్మిస్తున్నారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 3d ఇలా నిర్మాణాలు చేపట్టారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ లో లో ఇప్పటివరకు 130 ఇళ్ళను నిర్మించినట్లు కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల మీడియా సంస్థలకు తెలిపాడు.
తక్కువ ధరలో ఇల్లు నిర్మించాలని ఉద్దేశంతో త్రీడీ ఇళ్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ‘ పెహల్ ‘అనే ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కింద 250 ఇళ్ల డిజైన్ తయారు చేశారు. వీటిలో 3d ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్లు బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఇల్లు నిర్మాణంతో తక్కువ మొత్తం అవసరం ఉండడంతో పాటు మిగతా ఇళ్లతో పోలిస్తే ఇవి చాలా చల్లగా ఉండే అవకాశం ఉంది.
3d ప్రింటింగ్ టెక్నాలజీ ఇంటి నిర్మాణంలో ఎలాంటి కంకర వాడరు. కానీ స్లాబ్ కు మాత్రం ఇనుము వాడతారు. గోడలు పూర్తిగా ప్లేయూష్ ఇటుకలతో నిర్మిస్తారు. వీటి మధ్యన కాస్త సిమెంటును వాడతారు. మిగతా గోడలతో పోలిస్తే ఈ ఇటుకలకు తక్కువ సిమెంట్ అవసరం పడుతుంది. అయితే ఒక అంతస్తు నిర్మించుకునే వారు స్లాబ్ ను ఒకప్పటి పెంకుటిల్లులా నిర్మించుకోవచ్చు. అలాగే దీనిపై మరో రెండు అంతస్తులు వేసి కూడా ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అయితే వీటిని నిర్మాణానికి పిల్లర్లు అవసరం లేదు. అవి లేకుండా కూడా ఇంటి నిర్మాణం గట్టిగానే ఉంటుంది. ఇక వేసవికాలంలో మిగతా ఇళ్లతో పోలిస్తే ఈ ఇల్లు చాలా చల్లగా ఉంటుంది. బయట ఉండే ఉష్ణోగ్రత కంటే 10 సెంటీ గ్రేడ్లు ఇందులో తక్కువగా నమోదు అవుతుంది. మొత్తంగా ఈ ఇంటి నిర్మాణానికి రూ. 2 లక్షలు ఖర్చు అవుతుంది.. అంతేకాకుండా 45 రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు.