Lifespan: వాతావరణ కాలుష్యం.. శారీరక శ్రమ తగ్గడంతో మనుషుల ఆరోగ్యాల విషయంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు శారీరకంగా ఎక్కువగా పనిచేసిన వారు ఇప్పుడు ఒకే చోట కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని కలుషితమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. అయితే గతంలో కంటే ఇప్పుడు శారీరక శ్రమ చేయకపోయినా పర్వాలేదు. కానీ కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల ఆయుష్షు పెరిగే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. 11 శాతం మంది 60 ఏళ్లు దాటుతున్నారు. 7 శాతం మంది 65 నుంచి 70 ఏళ్ల వరకు జీవిస్తున్నారు.5 శాతం మంది 80 కి చేరువలో ఉంటున్నారు. 3 శాతం మంది మాత్రమే 80 కి దాటి 90 కి చేరువలో వెళ్తున్నారు. అయితే ఇలా వయసులో తేడా ఉండడానికి వారు పాటించే ఆరోగ్య నియమాలే కారణమని తెలుస్తోంది. మరి ఆయుష్షు పెరగడానికి ఏం చేయాలి? ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి?
సంతోషం:
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి కాలంలో సంతోషం కరువైపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనితో ప్రతి ఒక్కరూ బిజీగా మారిపోతున్నారు. అయితే ప్రతిరోజు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకొని కనీసం గంట పాటు రిలాక్స్ కావాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా ఉండాలి. అవసరం అయితే ఉదయం కొందరు స్నేహితులతో కలిసి వాకింగ్ చేస్తూ సంతోషంగా ఉండడంవల్ల ఆయుష్షు పెరిగే అవకాశం ఉంటుంది.
స్వీట్ అండ్ సాల్ట్:
ఈ రెండు లేకపోతే ఏ ఆహార పదార్థం రుచిగా ఉండదు. కానీ ఇంట్లో కంటే బయట దొరికే పదార్థాల్లో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా స్వీట్ ఈమధ్య ఎక్కువగా మారడం వల్ల డయాబెటిక్ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొని ఆయుషులను తగ్గించుకుంటున్నారు. అయితే చాలావరకు పదార్థాల్లో ఉప్పు, చక్కెర వినియోగాన్ని తగ్గించడం వల్ల ఎలాంటి అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది.
వ్యాయామం:
కొన్ని రకాల పనుల కారణంగా బిజీ వాతావరణం ఏర్పడుతుంది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు ప్రతిరోజు వ్యాయామం చేయలేకపోతున్నారు. అయితే ఎంత బిజీ వాతావరణం లో గడిపినా.. గంటపాటు వ్యాయామానికి కేటాయించాలి. అలాగే చాలామంది కూర్చొని పనిచేసే వారు ఎక్కువగా ఉన్నారు. మీరు ప్రతి అరగంటకు ఒకసారి అటు ఇటు తిరిగే ప్రయత్నం చేయాలి. వీలైతే సైక్లింగ్ కూడా చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా మారిపోతుంది.
ప్రోటీన్లు:
ప్రతిరోజు కడుపు నిండడానికి రకరకాల ఆహార పదార్థాలు తింటున్నారు. కానీ ఇందులో ఎంతవరకు ప్రోటీన్లు ఉన్నాయని విషయాన్ని గుర్తించాలి. కొవ్వు పదార్థాలు ఉండే వాటిని పక్కనే ఉంచి ప్రొటీన్లు కలిగిన వాటిని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి. ప్రోటీన్లు వాడడం వల్ల శరీరంలో మృత కణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది.
ఫీలింగ్స్:
చాలావరకు పాజిటివ్ ఫీలింగ్స్ తోనే ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు చేసే పనులు నచ్చకపోవచ్చు. అయితే వీటిని కూడా పాజిటివ్ కోణంలో చూసి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంతేకానీ వారిపై కోపం, ద్వేషం ఉంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీంతో ఆలోచన శక్తి తప్పుదారి పట్టి జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. అలాంటి ఆలోచనలేకుండా పాజిటివ్ కోణంలో ఉంటూ ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి.