Deep Fake Scam: డీప్‌ఫేక్‌తో భారీ మోసం.. ఏకంగా రూ.200 కోట్లు కొల్లగొట్టారు..

ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈసారి డీఫ్‌ ఫేక్‌ ఉపయోగించి మనుషులు, సెలబ్రిటీలను కాదు కంపెనీనే మోసం చేశారు.

Written By: Raj Shekar, Updated On : February 23, 2024 1:39 pm
Follow us on

Deep Fake Scam: డీప్‌ఫేక్‌.. ఇటీవల వార్తల్లో నిత్యం నిలుస్తున్న అంశం. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. వ్యక్తిని పోలిన వ్యక్తిని డీప్‌ఫేక్‌ సహాయంతో మార్ఫింగ్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇంత వరకు వ్యక్తిని పోలిన వ్యక్తులతో వీడియోలు చేయడం మనం చూశాం. ఈ డీప్‌ఫేక్‌ బారిన ఎక్కువగా సెలబ్రిటీలే పడుతున్నారు. హీరోయిన్‌ రష్మిక మందన నుంచి లెజెండ్‌ క్రికెటర్‌ సచిన్‌ వరకు చాలా మంది డీప్‌ఫేక్‌ బాధితులే. అయితే.. ఇప్పుడు ఇదే డీప్‌ఫేక్‌ సహాయంలో కొంతమంది ఏకంగా రూ.200 కోట్లు కొల్లగొట్టాడు.

ఏఐతో అనేక సమస్యలు..
ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈసారి డీఫ్‌ ఫేక్‌ ఉపయోగించి మనుషులు, సెలబ్రిటీలను కాదు కంపెనీనే మోసం చేశారు. హాంకాంగ్‌లో ఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను డీప్‌ఫేక్‌ చేసి ఈ మోసానికి పాల్పడ్డారు.

పబ్లిక్‌ ఫొటోలతో..
పబ్లిక్‌గా అందుబాటులో ఉండే కంపెనీ ఆఫీసర్స్, ఫైనాన్షియర్స్‌ ఫొటోలను సేకరించి క్లోన్‌ చేసి వారికి సంబంధించిన డీఫ్‌ఫేక్‌ ఫొటోలు తయారు చేశారు. కంపెనీకి చెందిన ఒక ఫైనాన్స్‌ ఆఫీసర్‌ను మీటింగ్‌కు పిలిచారు. సీక్రెట్‌ జూమ్‌ ద్వారా ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ ఒక్కడే కంపెనీకి చెందినవారు. మిగతా అంతా డీప్‌ఫేక్‌తో మార్ఫిగ్‌ చేసిన అధికారులే. మీటింగ్‌ తర్వాత ఆ ఎంప్లాయ్‌కి డీప్‌ఫేక్‌తో రూపొందించిన సీఎఫ్‌వో(చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌) సదరు ఫైనాన్స్‌ అధికారికి ఫోన్‌ చేశాడు. వెంటనే 25 మిలియన్‌ డాలర్లు తన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చెప్పాడు.

బాస్‌ ఫోన్‌ చేశాడని..
బాస్‌ ఫోన్‌ చేసిన డబ్బులు అడగడంతో కాదనలేకపోయాడు. ఫేస్‌ వాయిస్‌ కూడా సీఎఫ్‌వో లాగానే ఉండడంతో వివిధ ఖాతాల నుంచి 25 మిలియన్‌ డాలర్లు భారత కరెన్సీలో 200 కోట్లు అతని ఖతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. దీంతో కంపెనీకి 200 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అసలు విషయం ఆలస్యంగా తెలుసుకుని కంపెనీ యాజమాన్యం తలలు పట్టుకుంది.