https://oktelugu.com/

PAN Card: పాన్‌ కార్డు నంబర్‌.. దానిపై ఉండే టెన్ డిజిట్ మీనింగ్‌ తెలుసా?

ప్రతీ పాన్‌కార్డుపై పది అంకెల నంబర్‌ ఉంటుంది. చాలా మంది నంబర్‌ గుర్తు పెట్టుకుంటారు. కానీ వాటికి అర్థం మాత్రం తెలుసుకోరు. మొదటి ఐదు క్యారెక్టర్లు ఆల్ఫాబెట్స్‌ ఉంటాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 23, 2024 / 01:42 PM IST
    Follow us on

    PAN Card: పాన్‌కార్డు.. ఇప్పుడు అందరికీ తప్పనిసరి అయింది. పాన్‌ కార్డు ఉన్న అందరూ ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలనే నిబంధన కూడా కేంద్రం తీసుకువచ్చింది. పన్ను ఎగవేత లేకుండా, లావాదేవీలు సంక్రమంగా జరిగేందుకు పాన్‌కార్డు తప్పనిసరి చేసింది. దేశంలో 75 శాతం మంది పాన్‌కార్డు కలిగి ఉన్నారు. అయితే ఈ పాన్‌కార్డు గుచించి చాలా మందికి తెలియదు. చదువుకున్నప్పటికీ దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు. అయితే పాన్‌కార్డు, దానిపై ఉండే నంబర్‌ అర్థాలు తెలుసుకుందాం.

    ప్రతీ కార్డుపై టెన్‌ డిజిట్స్‌ నంబర్‌
    ప్రతీ పాన్‌కార్డుపై పది అంకెల నంబర్‌ ఉంటుంది. చాలా మంది నంబర్‌ గుర్తు పెట్టుకుంటారు. కానీ వాటికి అర్థం మాత్రం తెలుసుకోరు. మొదటి ఐదు క్యారెక్టర్లు ఆల్ఫాబెట్స్‌ ఉంటాయి.
    – ఆల్ఫాబెట్స్‌లో మొదటి మూడు ఆల్ఫాబెట్స్‌ సిరీస్‌ను రిప్రజెంట్‌ చేస్తాయి. ఈ సిరీస్‌లో త్రిబుల్‌ ఏ నుంచి త్రిబుల్‌ జెడ్‌ వరకు ఉంటాయి.

    – నాలుగో క్యారెక్టర్‌ ఇన్‌కం టాక్స్‌ డిపార్ట్‌మంట్‌కు మీరు ఎవరు అనే విషయం తెలియజేస్తుంది.

    – P అక్షరం ఉంటే ఇండివ్యూజువల్‌ అని అర్థం

    – C అక్షరం ఉంటే.. కంపెనీ అని అర్థం.

    – H అని ఉంటే.. హిందూ అన్‌ డివైడెడ్‌ ఫ్యామిలీ.

    – A అని ఉంటే అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌.

    – B అని ఉంటే.. బాడీ ఆఫ్‌ ఇండివ్యూజివల్స్‌.

    – G అక్షరం ఉంటే.. గవర్నమెంట్‌ ఏజెన్సీ.

    – J అక్షరం ఉంటే.. ఆర్టిఫీషియల్‌ జురీడియల్‌ పర్సన్‌.

    – L అక్షరం ఉంటే.. లోకల్‌ అథారిటీ అని అర్థం.

    – F అని ఉంటే.. ఫర్మ లేదా లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌

    T అని ఉంటే.. ట్రస్టు అని అర్థం వస్తుంది.

    ఇక ఐదో ఆల్ఫాబెట్‌..
    ఇక కార్డుపై ఉన్న ఐదో ఆల్ఫాబెట్‌ కార్డు హోల్డర్‌ సర్‌నేమ్‌ను రిప్రజెంట్‌ చేస్తుంది.

    సీక్వెన్షియల్‌ నంబర్స్‌..
    ఇక ఈ ఐదు తర్వాత ఉండే నాలుగు నంబర్లు సీక్వెన్షియల్‌ నంబర్లు. 001 నుంచి 9999 వరకు ఉంటాయి. లాస్ట్‌ పదోది మళ్లీ ఆల్ఫాబెట్‌. ఇది ఫార్మాట్‌ను సూచిస్తుంది.