Mahesh Babu- Vijay: తీసిన సినిమాలు మొత్తం ఫట్ అయిపోతున్నాయి. దిల్ రాజుకు అర్జెంటుగా ఒక హిట్ కావాలి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బీస్ట్ అడ్డంగా ప్లాప్ అయింది. ఇప్పుడు విజయ్ కి ఒక హిట్ పడాలి. మహర్షి తర్వాత పైడిపల్లి వంశీ ఒక్క సినిమా కూడా తీయలేదు. సో ఎలా చూసుకున్నా ఈ ముగ్గురికి హిట్ అవసరం. అందుకే ఈ ముగ్గురు కలిశారు. వారసుడు అనే పేరుతో 6 నెలల క్రితం ఒక సినిమా ప్రారంభించారు. ఇప్పుడు వచ్చేవన్నీ పాన్ ఇండియా సినిమాలు కాబట్టి.. దీన్ని తెలుగు, తమిళంలో రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తోంది. ఖుష్బూ సుందర్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నది.
మహర్షితో పోలికలు
మూడేళ్ల క్రితం మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన మహర్షి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. వ్యవసాయ నేపథ్యంలో వచ్చిన మహర్షి సినిమా మంచి వసూళ్ళను రాబట్టింది. ఈ సినిమా తర్వాత మళ్లీ వంశీ, మహేష్ కాంబినేషన్లోనే మరో సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అది పట్టాలు ఎక్కలేదు. ఎక్కడో చిన్న గ్యాప్ వల్ల ఆ ప్రాజెక్టు ఇంకా అమలుకు నోచుకోలేదు. ఇదే సమయంలో మహేష్ బాబు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పరశురామ్ దర్శకత్వం లో సర్కార్ వారి పాట సినిమాలో నటించాడు. బాక్సాఫీస్ వద్ద అది యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇదే క్రమంలో బీస్ట్ ద్వారా ఒక ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న విజయ్ కి వంశీ చెప్పిన కథ బాగా నచ్చింది. దీనికి నిర్మాతగా దిల్ రాజు కన్ ఫర్మ్ కావడంతో పట్టాలు ఎక్కింది. ఇంత వరకూ బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే మొదలైంది.
ఇంతకీ ఏమిటంటే
మహర్షి సినిమాలో మహేష్ లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. రబ్ డ్ గడ్డంతో చాలా యంగ్ గా కనిపిస్తాడు. ఈ లుక్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వంశీ కూడా విజయ్ మేక్ ఓవర్ అలానే చేయించాడు. పైగా ఈ సినిమాలో జయసుధ విజయ్ కి తల్లిగా నటిస్తున్నారు. మహర్షి లో కూడా మహేష్ కి తల్లిగా జయసుధ నటించింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ బయటకు వచ్చాయి. అవి అప్పట్లో మహర్షి మాదిరే కనిపిస్తున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. అప్పట్లో మహేష్ కు చెప్పిన కథే విజయ్ కి చెప్పాడని, అదే ఇప్పుడు వారసుడిగా తీస్తున్నారని సినీ సర్కిల్లో టాక్. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే వంశీ పంట పండినట్టే.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tamil vijay copying telugu mahesh babu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com