https://oktelugu.com/

ఓ ఇంటివాడైన చాహల్‌

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. కొరియోగ్రాఫర్, పాపులర్ యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను వివాహమాడాడు. వీళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ధనశ్రీ డ్యాన్సర్. ఆమెకు యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ కు ముందే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. కరోనా టైంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. నేటితో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని చాహల్ ఇన్‌స్టా, ట్విట్టర్‌‌లో పంచుకున్నాడు. Also Read: ఆస్ట్రేలియాతో 2వ టెస్టు: జట్టులోకి ‘ఆ నలుగురు’ గురుగ్రామ్‌లో […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 23, 2020 / 11:36 AM IST
    Follow us on

    టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. కొరియోగ్రాఫర్, పాపులర్ యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను వివాహమాడాడు. వీళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ధనశ్రీ డ్యాన్సర్. ఆమెకు యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ కు ముందే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. కరోనా టైంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. నేటితో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని చాహల్ ఇన్‌స్టా, ట్విట్టర్‌‌లో పంచుకున్నాడు.

    Also Read: ఆస్ట్రేలియాతో 2వ టెస్టు: జట్టులోకి ‘ఆ నలుగురు’

    గురుగ్రామ్‌లో జరిగిన వీరి వివాహానికి అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమైన బంధువులు, స్నేహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. అయితే.. ధనశ్రీతో చాహల్‌కు ఆగస్టులోనే నిశ్చితార్థం అయ్యింది. ఈ నిశ్చితార్థం కూడా కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఎవరికీ చెప్పకుండా చేసుకున్నాడు. ఆ తరువాత ధనశ్రీతో నిశ్చితార్థం అయ్యిందంటూ చాహల్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇక పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా చాహల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

    ‘మేం ఒక్కటయ్యాం. గతంలోనే మాకు పరిచయం ఏర్పడింది. మేం ఎప్పుడూ సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం. అందుకే పెళ్లిచేసుకున్నాం’ అంటూ చాహల్ పోస్ట్ పెట్టాడు. అయితే క్రికెట్ అభిమానులు ఆర్సీబీ ఫ్యాన్స్ చాహల్‌కు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్స్ చాహల్’ అంటూ కామెంట్ బాక్స్‌ను నింపేశారు. మరోవైపు క్రిస్‌గేల్, కర్ణశర్మ, రోహిత్‌ శర్మ భార్య రితికా కూడా చాహల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు కుటుంబాల అంగీకారంతోనే వీళ్లు పెళ్లిచేసుకున్నట్టు సమాచారం.

    Also Read: చేతులెత్తేసిన టీమిండియా..: మొదటి టెస్టులో ఓటమి

    చాహల్ అద్భుతమైన స్పిన్నర్. అవసరమైనటైంలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఇరుకున పెట్టడం అతడి స్పెషాలిటీ. ఆర్సీబీ తరఫున ఆడేటప్పుడు కూడా అతడు ఎంతో కీలకంగా వ్యవహరించాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి విరాట్ కోహ్లి బంతిని చాహల్‌కే ఇస్తుంటాడు. అలాగే చాహల్ డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ, స్టేడియంలోనూ ఎంతో ఫన్నీగా ఉంటాడు. ఎప్పుడూ జోకులేస్తూ తోటి ఆటగాళ్లను నవ్విస్తూ ఉంటాడు. ప్రత్యర్థి జట్టు క్రికెటర్లతోనూ ఎంతో ఫన్నీగా మాట్లాడటం అతడి స్పెషాలిటీ. క్రిస్‌గేల్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం చాహల్‌ను ఎంతో ఇష్టపడతారు.