https://oktelugu.com/

టీజర్ టాక్:ప్రేమ కోసం పరితపించే ఆది ‘శశి’

డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న ‘శశి’ మూవీ టీజర్ విడుదలైంది. సురభి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. Also Read: జబర్ధస్త్ లవ్.. వర్ష ప్రేమ ఫలిస్తుందా? డిసెంబర్ 23 న నేడు హీరో ఆది బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2020 / 11:49 AM IST
    Follow us on

    డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న ‘శశి’ మూవీ టీజర్ విడుదలైంది. సురభి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

    Also Read: జబర్ధస్త్ లవ్.. వర్ష ప్రేమ ఫలిస్తుందా?

    డిసెంబర్ 23 న నేడు హీరో ఆది బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘శశి’ టీజర్ విడుదలైంది.

    టీజర్ చూస్తే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా అర్థమవుతోంది. అమ్మాయి ప్రేమ కోసం చివరి వరకు నిలబడే హీరోగా ఆది ఇందులో కనిపించబోతున్నారు.ఈ సినిమా యాక్షన్ ఘట్టాలు బాగానే వచ్చాయి. ఇప్పటివరకు కనిపించని రఫ్ లుక్ లో ఆది అలరించారు.

    Also Read: స్టార్ హోటల్లో దాక్కున్న KGF రాకీ భాయ్ .. కారణం తెలిస్తే షాకింగే!

    రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, తులసీ, తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించారు. కొన్నాళ్లుగా హిట్ కోసం చూస్తున్న ‘ఆది’కి ఈ చిత్రం బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ లో ఇన్నాళ్లు ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతుండడంతో విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్