Pawan Kalyan Anna Lezhneva: అన్న చిరంజీవి వల్ల సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగారు. ఈయన ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఆరోగ్యం సహకరించకపోయినా లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు పవన్. ఈయనను చూడటానికి ఎన్నో లక్షల మంది ప్రజలు వస్తున్నారనేది కాదనలేని వాస్తవం. ఇదిలా ఉంటే పవన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత షూటింగ్స్ లో పాల్గొంటారు. ఈయన నటిస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా కూడా రాబోతోంది. ఇక సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా రావడానికి సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ లేకపోవడంతో ఈ సినిమా షూటింగ్ లకు విరామం వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 30వ తేదీ 2013లో లెజ్నెవా ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈయన నటించిన తీన్ మార్ సినిమాలో అన్నా లెజ్నెవా హీరోయిన్ గా నటించారు. అప్పుడే వీరిద్దరు కూడా ప్రేమలో పడ్డారని టాక్. ఇప్పుడు వీరిద్దరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు, పోలేనా అంజనా పవనోవా అనే కూతురు ఉన్నారు. ఇక అన్నా అప్పుడప్పుడు బయట కనిపిస్తూ ఫ్యాన్స్ ఊరెత్తిస్తుంటుంది. రీసెంట్ గా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకల్లో కనిపించారు. ఈమె 1980లో పుట్టారు.
ఇప్పుడు ఈమె వయసు 44 సంవత్సరాలు అయితే పవన్ కళ్యాణ్ పుట్టింది సెప్టెంబర్ 2వ తేదీ 1968లో పుట్టారు. అంటే పవన్ కళ్యాణ్ వయసు 55 సంవత్సరాలు. ఇక వీరిద్దరి మధ్య 11 సంవత్సరాల వయసు తేడా ఉంది. ఇక పవన్ భార్య అన్నా వ్యాపారవేత్తగా తన కెరీర్ ను కంటిన్యూ చేస్తోంది. ఈమెకు దుబాయ్ లాంటి దేశాల్లో కూడా హోటల్స్ ఉన్నాయి. వాటి బాధ్యతలు ఈమెనే చూసుకుంటుంది.