Yuzvendra Chahal IPL Finals : టోర్నీలలో సాగిన మిగతా మ్యాచ్లో జట్టు సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించినప్పటికీ.. చివరి అంచె పోటీలో విఫలమైతే మాత్రం ఆ ఆవేదన వర్ణనకు అందదు. అలాంటి సమయంలో ఏ ఆటగాడు అయినా సరే తీవ్రమైన నిరాశకు గురవుతాడు.. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కన్నడ జట్టు మొత్తానికి గెలుపును దక్కించుకుంది. ట్రోఫీని కూడా అందుకుంది. దశాబ్దానికి మించిన ఎదురుచూపులకు శుభం కార్డు వేసింది. ఇక చివరి అంచె మ్యాచ్ లో అయ్యర్ జట్టు రన్నర్ అప్ గా నిలిచింది.. ట్రోఫీకి దగ్గరగా వచ్చి ఓడిపోవడంతో అయ్యర్ జట్టు ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఓడిపోతున్న సందర్భాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమైన ప్లేయర్ల జాబితాలో.. కీలక ఆటగాడు ఒకరు ఉన్నారు. అతడు మూడు ఐపిఎల్ చివరి అంచె పోటీలలో ఆడి ఓడిపోయిన ఆటగాడిగా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇంతకీ అతడు ఎవరంటే..
Also Read : కోహ్లీ, కృణాల్ గురించి తెగ పొగడుతున్నారు గాని.. ఈ ఆటగాడిని మర్చిపోతున్నారు..
ఇటీవల జరిగిన ఐపీఎల్ లో అయ్యర్ జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చాడు చాహల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో హైయెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ గా అతడు రికార్డు సృష్టించాడు. అతడు గతంలో కన్నడ జట్టు తరఫున కూడా ఆడాడు. ఏడు సీజన్లలో ప్రాతినిధ్యం వహించాడు. 2016లో కన్నడ జట్టు ఫైనల్ వచ్చినప్పటికీ.. కావ్య జట్టు చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత చాహల్ రాజస్థాన్ జట్టులోకి వెళ్ళాడు. 2022లో గుజరాత్ పై రాజస్థాన్ దారుణంగా ఓడిపోయింది. ఇక ఇప్పుడు అయ్యర్ జట్టు తరపున చాహల్ ఆడాడు. కన్నడ జట్టుతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ సేన ఓడిపోయింది. తన జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్ గా సేవలు అందించినప్పటికీ టైటిల్ అందుకునే అవకాశాలు లేకపోయింది. దీంతో అతడిని ఇనుప ఏనుగు పాదం అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
చాహల్ అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు. కానీ అతని దురదృష్టం ఏంటో తెలియదు కానీ.. చివరి అంచె పోటీలో మాత్రం అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు గెలవలేక పోతోంది. దారుణమైన ఓటమికు ఎదుర్కొంటూ ట్రోఫీకి దూరంగా జరుగుతోంది. అతడు జట్లు మారుతున్నప్పటికీ ఇదే ఫలితం రావడం సగటు ఐపిఎల్ అభిమానిని ఆవేదనకు గురిచేస్తోంది. ఇక ఇదే అదునుగా కొంతమంది అతడిని విమర్శిస్తున్నారు. ఇనుప ఏనుగు పాదం అంటూ గేలి చేస్తున్నారు. మరి ఈ పరిస్థితి నుంచి చాహల్ ఎలా బయటపడతాడో చూడాలి.. అన్నట్టు చాహల్ ఇటీవల తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం వేరే యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. మరి ఆ బంధం ఎక్కడిదాకా వెళ్తుంది.. కలకాలం నిలబడుతుందా.. అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.