Yuvraj Singh : హైదరాబాద్ జట్టు తరుపున అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి.. టీమిండియాలోనూ చోటు సంపాదించాడు. ప్రస్తుతం అతడు టి20 జట్టులో కీలకమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అంతేకాదు తన అమోఘమైన బ్యాటింగ్ తో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. అభిషేక్ శర్మ ఈ స్థాయిలో ప్రదర్శన చేస్తున్నాడంటే.. యువరాజ్ సింగ్ వల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు అభిషేక్ శర్మ ఈ స్థాయిలో రాటు తేలడానికి ప్రధాన కారణం యువరాజ్ సింగ్.. యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ కూడా అభిషేక్ శర్మ గొప్ప క్రికెటర్ కావడంలో తోడ్పడ్డాడు.. తన విశేషమైన నైపుణ్యాన్ని.. అపారమైన అనుభవాన్ని అభిషేక్ శర్మకు అందించాడు యోగ్ రాజ్ సింగ్..
Also Read : ఆ జట్టు పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ఇందులో నిజమెంత?
జల్సా పురుషుడు
అభిషేక్ శర్మ బయటికి కనిపించేంత అమాయకుడు కాదు. రాత్రిపూట పార్టీలు.. గర్ల్ ఫ్రెండ్స్ తో అతడు జల్సా చేసేవాడు. వీటన్నిటిని దూరం చేయడానికి అభిషేక్ శర్మ తండ్రి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎప్పుడైతే అభిషేక్ యువి దగ్గరికి వచ్చాడో.. అప్పటినుంచి అతని లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.. రాత్రిపూట పార్టీలు బంద్ చేయించాడు. గర్ల్ ఫ్రెండ్స్ వ్యవహారాన్ని దూరంగా ఉంచాలని సూచించాడు..” అభిషేక్ ఎక్కడ ఉన్నావ్.. రాత్రి 9 అయింది కదా ఇక పడుకో.. నన్ను అనవసరంగా అరవనీయకు.. నేను చెబుతోంది నీకు అర్థం అవుతోంది కదా.. లేకపోతే నీ దగ్గరికి నేరుగా నేనే రావాలా” అని యువరాజ్ అభిషేక్ శర్మ పై అరిచేవాడు. అతడు భయానికి అభిషేక్ శర్మ రాత్రి 9 గంటల లోపే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునేవాడు. తన గదిలో నిద్రకు ఉపక్రమించేవాడు. ఆ తర్వాత తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేచేవాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టేవాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు.. బౌలింగ్ కూడా చేసేవాడు. ఇక మైదానంలో జాగింగ్.. రన్నింగ్.. జిమ్ లో కసరత్తులు విపరీతంగా చేసేవాడు. అందువల్లే అతడు ఈ స్థాయిలో ఆడుతున్నాడు. అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టు తరఫున నిప్పురవ్వలాగా మారడానికి ప్రధాన కారణం యువరాజ్ అయితే.. అందులో అతని తండ్రి యోగ్ రాజ్ కు కూడా ప్రధాన భాగం ఉంది. అభిషేక్ శర్మ ను చాలామంది పక్కింటి అబ్బాయి అని అనుకుంటారు. కానీ అతని గురించి యువరాజ్ చెప్పిన తర్వాతే అసలు విషయాలు తెలిసాయి.. అభిషేక్ జల్సా పురుషుడని.. కాకపోతే తన వద్దకు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయాడని యువరాజ్ సింగ్ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. ఇప్పుడిక అభిషేక్ శర్మ పూర్తిగా మారిపోయాడు. తన బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మార్చేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. దూకుడుకు సరికొత్త అర్ధాన్ని చెప్తున్నాడు.. హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.