Yuvraj Singh Six Sixes: అతడు సినిమా చూశారా.. అందులో ఓ సన్నివేశంలో సునీల్ తనికెళ్ల భరణి ని ఉద్దేశించి..” నాయుడూ నువ్వు నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావ్” అని అంటాడు.. అసలు విషయంలో సునీల్ మాట్లాడిన మాట నూటికి నూరు శాతం సరిపోతుంది. ఆ మాటను నిజజీవితంలో నిజం చేసి చూపించినవాడు యువరాజ్ సింగ్. మామూలుగా కాదు ఇప్పటికీ తన పేరు గుర్తుకు వస్తాయి ప్యాంటు తడుపుకునేలా చేసాడు. డైపర్ వేసుకున్నా ఆ ప్రవాహం ఆగకుండా చూసుకున్నాడు. ఎందుకంటే యువరాజ్ సృష్టించిన సునామీ అటువంటిది. కల్పించిన భయం అటువంటిది. పెట్టిన ఇబ్బంది అటువంటిది.
మామూలుగా అయితే క్రికెట్లో అప్పటిదాకా సిక్సర్లు వరుస పెట్టి కొట్టిన చరిత్ర ఏ ఆటగాడికి లేదు. మహా అయితే వరుసగా రెండు లేదా మూడు అంతవరకే పరిమితమయ్యారు. కాని దానిని పూర్తిగా మార్చేశాడు యువరాజ్. తనకు మాత్రమే సాధ్యమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. భయం అనేది తనకు తెలియదని.. బెదురు అనేది తన డిక్షనరీలో లేదని.. నిరూపించాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేసి.. భయంకరంగా పరుగులు రాబట్టి.. ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కు నిద్రలేని రాత్రులు పరిచయం చేశాడు. తన పేరు మీద ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డును సృష్టించుకున్నాడు. తన పేరు మీద సరికొత్త చరిత్ర లికించుకున్నాడు.
2007 t20 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్, భారత్ తలపడ్డాయి. అప్పటిదాకా యువరాజ్ కూల్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ప్లింటాఫ్ సీన్లోకి వచ్చాడు. యువరాజ్ ను గెలికాడు. యువరాజ్ కూడా గట్టిగానే బదులిచ్చాడు. ప్లింటాఫ్ బౌలింగ్ లో దుమ్మురేపాడు. అంతటితోనే ఆగలేదు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. తద్వారా 12 బంతుల్లోనే అర్థ శతకం పూర్తిచేసి.. టి20లో రికార్డు సృష్టించాడు.. ఆ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది అంతేకాదు టి20 వరల్డ్ కప్ కూడా అందుకుంది. 18 సంవత్సరాలు గడిచినప్పటికీ.. ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. యూట్యూబ్లో పదేపదే చూస్తూ ఉంటారు. ఎందుకంటే యువరాజ్ చేసిన మ్యాజిక్ అటువంటిది. అన్నట్టు యువరాజ్ కొట్టిన ఆరు సిక్సర్ల ఘనతకు నేటికీ 18 సంవత్సరాలు. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఇదే రోజు యువరాజ్ ఇంగ్లాండ్ మీద ఆ ఘనత సృష్టించాడు.
1️⃣8️⃣ years ago, Yuvi gave us a moment we still can’t get over pic.twitter.com/K6KcdsDIk9
— SunRisers Hyderabad (@SunRisers) September 19, 2025