Yusuf Pathan: సెలబ్రిటీలకు సమాజంలో విపరీతమైన గౌరవ మర్యాదలుంటాయి. పేరు ప్రఖ్యాతలు అంతకంటే ఎక్కువగా ఉంటాయి. అందువల్లే ప్రజలు వారిని గొప్ప వారిగా పేర్కొంటుంటారు. వారిని ఆదర్శంగా తీసుకొని పైకి రావాలని భావిస్తుంటారు. ప్రభుత్వాలు కూడా చేపట్టే కార్యక్రమాలలో సెలబ్రిటీలను భాగస్వామ్యలను చేస్తుంటాయి. తద్వారా సమాజంలో ఎంతో కొంత మార్పు వస్తుందని ప్రభుత్వాలు నమ్ముతుంటాయి. కానీ కొంతమంది సెలబ్రిటీలు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ నేలబారు వ్యవహారాలకు పాల్పడుతుంటారు. పదిమందిలో నవ్వుల పాలవుతుంటారు. అటువంటి సెలబ్రిటీల జాబితాలో యూసఫ్ పఠాన్ ముందు వరుసలో ఉంటాడు.
దూకుడు అయిన ఆటతీరు కొనసాగించడం వల్ల టీమిండియాలో యూసఫ్ పఠాన్ కు మంచి పేరు ఉంది. పైగా ఇతడి సోదరుడు ఇర్ఫాన్ ఒకప్పుడు టీమిండియా బౌలింగ్ దళానికి వెన్నెముకలాగా ఉండేవాడు. అటువంటి చరిత్ర ఉన్న యూసఫ్ పఠాన్ ఇప్పుడు వరుస వివాదాలలో చిక్కుకుంటున్నాడు. ఏకంగా గౌరవనీయ న్యాయస్థానాలతో తిట్లు తింటున్నాడు.. ఏకంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పరువు తీసుకుంటున్నాడు. గుజరాత్ హైకోర్టు ఆక్రమణదారుడిగా పేర్కొన్నదంటే యూసఫ్ బాగోతం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అంతేకాదు సెలబ్రిటీలకు చట్టాల నుంచి మినహాయింపు ఉండదని హైకోర్టు వ్యాఖ్యానించింది అంటే అతడి ఆక్రమణ పర్వం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర ప్రాంతంలో తన ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని యూసఫ్ ఆక్రమించాడు. దీనిపై 2012లోనే అక్కడి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసులకు సమాధానం చెబుతూ.. తాను, తన సోదరుడు క్రికెటర్ల మని.. సెక్యూరిటీ దృష్ట్యా ఆ భూమిని కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. అయితే దానికి హైకోర్టు ఒప్పుకోలేదు.. దీంతో యూసఫ్ పఠాన్ బాగోతం బయటపడింది. అక్కడితోనే అతడు ఆగిపోలేదు. తాజాగా మరో వివాదంలో వేలు పెట్టాడు.
బెంగాల్ రాష్ట్రంలోని అదీ నా మసీదుపై యూసఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆ మసీదును అతడు అద్భుత కట్టడం గా ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. దానిని సుల్తాన్ సికిందర్ నిర్మించాడని పోస్ట్ చేశాడు. దీనిపై కమల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అది మసీదు కాదని.. ఆదినాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించారని కౌంటర్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మరోసారి యూసఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నాడు. అన్నట్టు యూసఫ్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
The Adina Mosque in Malda, West Bengal, is a historic mosque built in the 14th century by Sultan Sikandar Shah, the second ruler of the Ilyas Shahi dynasty. Constructed in 1373-1375 CE, it was the largest mosque in the Indian subcontinent during its time, showcasing the region’s… pic.twitter.com/EI0pBiQ9Og
— Yusuf Pathan (@iamyusufpathan) October 16, 2025