Walk After Eating: ప్రస్తుత కాలంలో రకరకాల ఆహార పదార్థాలు తినడం వల్ల బరువు పెరిగి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా శారీరక శ్రమ లేకుండా.. కూర్చొని పనిచేయడం వల్ల కూడా అదనపు కొవ్వు పెరుగుతుంది. దీంతో చాలామంది ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్న కూడా ఫలితం ఉండడం లేదు. అయితే ఉదయం సాయంత్రం తో పాటు భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆహారం తిన్న వెంటనే వాకింగ్ చేయడం వల్ల త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే కొందరు తిన్న వెంటనే నడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఆ జాగ్రత్తల వివరాల్లోకి వెళ్తే..
భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నిలువలు స్థిరంగా ఉంటాయి. శరీరం అటు ఇటు కదలడం వల్ల గ్లూకోస్ కండరాలకు వ్యాపిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఆహారం తిన్న వెంటనే వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అలాగే జీర్ణ క్రియ మెరుగుదలగా ఉంటుంది. కడుపు, పేగుల్లో ఉండే కండరాలు ఉత్తేజితమై జీర్ణవ్యవస్థను వేగంగా చేస్తాయి. భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల రక్తపోటును నివారించవచ్చు. చెడు కొలెస్ట్రాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
అయితే భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. చాలామంది భోజనం చేసిన వెంటనే నడవకుండా పది నిమిషాల తర్వాత నడవడం మంచిది. ఎందుకంటే వెంటనే నడవడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆహారం తిని నడవడం వల్ల కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. జీర్ణక్రియకు రక్తం అవసరం. అయితే వేగంగా నడవడం వల్ల రక్తం కండరాలకు మళ్ళించబడుతుంది. అయితే కొందరు ఆహారం తిన్న తర్వాత వేగంగా నడుస్తూ ఉంటారు. ఇలా వేగంగా నడవడం వల్ల తీవ్రమైన అలసట వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆహారం తిన్న వెంటనే నడవకుండా కాసేపు విశ్రాంతి తీసుకొని వాకింగ్ చేయాలి.
కొందరు నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. ఆహారం తిన్న వెంటనే ఐదు నిమిషాల తర్వాత నడవడం మంచిది. అయితే ఈ నడక నెమ్మదిగా అయి ఉండాలి. వేగంగా నడవడం వల్ల కడుపులో అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంచెం సమయం తీసుకున్న తర్వాత నడవడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసి పడుకోవడం వల్ల.. జీరక్రియ సమస్యలు ఉండవు. హాయిగా నిద్రపట్టే అవకాశం ఉంటుంది. ఇక రాత్రి సమయంలో సాఫ్ట్ కోడ్ తీసుకొని నెమ్మదిగా నడవడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణముంటుంది. ఒకవేళ మాంసాహారం తీసుకోవాల్సి వస్తే ఎక్కువసేపు నడవడం మంచిది.