Yashasvi Jaiswal : తొలి ఇన్నింగ్స్ లో సిల్లీ పాయింట్ వద్ద జైస్వాల్ ఫీల్డింగ్ చేశాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్లు బంతిని కొట్టకముందే అతడు ఎగరడం మొదలుపెట్టాడు. ఇలా అనేకసార్లు చేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు ఒళ్ళు మండింది. వెంటనే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ” రేయ్ జైస్వాల్ ఏం ఫీల్డింగ్ చేస్తున్నావ్. గల్లీ క్రికెట్ ఏమైనా ఆడుతున్నావా? బంతి పడకుండానే ఎందుకు అలా ఎగురుతున్నావు? ఏమైనా అయిందా నీకు? ఇలా ఫీల్డింగ్ చేయడానికి ఇక్కడిదాకా వచ్చావా? కొంచమైనా బుద్ధి ఉందా? కాస్త బంతి గమనాన్ని పరిశీలించు. అంతేగాని బంతి పడకముందే అలా ఎగిరి గంతులు వేయకని” రోహిత్ చురకలంటించాడు. అయితే మొదటి ఇన్నింగ్స్ లో అలా ఎగిరి గంతులు వేస్తే.. రెండవ ఇన్నింగ్స్ లో జైస్వాల్ బంగారం లాంటి క్యాచ్ లను నేలపాలు చేశాడు.
మూడు క్యాచ్ లు వదిలేశాడు
బాక్సింగ్ డే టెస్ట్ లో టీమ్ ఇండియాతో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా రంగంలోకి వచ్చాడు. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. లేకుంటే సెంచరీ చేసేవాడే. ఒకవేళ అతడు గనుక సెంచరీ చేసి ఉంటే ఈ సిరీస్లో రెండవ శతకం బాదిన టీమిండియా ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు. పెర్త్ టెస్టులో 161 పరుగులు చేసి టీమిండియా విజయంలో జైస్వాల్ కీలకపాత్ర పోషించాడు. అయితే మెల్ బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ సమయంలో జైస్వాల్ కీలకమైన క్యాచ్ లను నేలపాలు చేశాడు. కమిన్స్, లబు షేన్ క్యాచ్ లను అందుకోలేకపోయాడు. దీంతో వారు టీమిండియా కు కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. వీరిద్దరూ మెరుగైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా టీమిండియా ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఒకవేళ గనుక జైస్వాల్ వారిద్దరి క్యాచ్ లు పట్టుకుని ఉంటే మ్యాచ్ స్వరూపం మరో విధంగా మారేది.. వాస్తవానికి బ్యాటింగ్లో.. ఫీల్డింగ్లో జైస్వాల్ చురుగ్గా ఉంటాడు. మరి అలాంటి ఆటగాడు ఆదివారం నాడు అలా ఎందుకు అయ్యాడో అర్థం కావడంలేదని సోషల్ మీడియా వేదికగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ” అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. అందులో అనుమానం లేదు. ఫీల్డింగ్ కూడా మెరుగ్గా చేస్తాడు. వంక పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఏదో జరిగింది.. అతడు ఏదో ఆలోచిస్తున్నాడు. అందువల్లే మూడు క్యాచ్ లను నేలపాలు చేశాడు. అందరి ఆగ్రహానికి గురయ్యాడు. పాపం ఇలాంటి పరిస్థితి యశస్వి జైస్వాల్ కు రావడం బాధాకరమని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Today Is Not Yashasvi Jaiswal’s Day In The Field.. pic.twitter.com/Qsii8a5zrb
— RVCJ Media (@RVCJ_FB) December 29, 2024
Captain Rohit Sharma is furious with Yashasvi Jaiswal after his third dropped catch of the day!
Did he just drop the match? #RohitSharma #YashasviJaiswal #AUSvIND #Sportskeeda pic.twitter.com/BY5sEGRSvf
— Sportskeeda (@Sportskeeda) December 29, 2024
Jaiswal on field during Boxing Day test #INDvAUS #INDvsAUS pic.twitter.com/tGcCAivlLY
— Anabothula Bhaskar (@AnabothulaB) December 29, 2024