Tollywood : ఆ ఫోటోలో ఉన్న పాప హీరోయిన్ నగ్మా. 1990లో విడుదలైన భాగీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగులో పెద్దింటి అల్లుడు మొదటి చిత్రం. సుమన్ కి జంటగా నటించింది. వరుసగా తెలుగు, హిందీ చిత్రాల్లో ఆమె నటిస్తూ వచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టింది. నగ్మాకు తెలుగులో భారీ ఫేమ్ ఉండేది. నగ్మా నటించిన ఘరానా మొగుడు, కొండపల్లి రాజా, మేజర్ చంద్రకాంత్, ముగ్గురు మొనగాళ్లు విజయం సాధించాయి.
అలాగే రజినీకాంత్ కి జంటగా నగ్మా బాషా చిత్రంలో నటించారు. ఇది ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం. కాగా నగ్మా సెట్స్ లో పొగరుగా ఉండేదనే టాక్. ఘరానా మొగుడు షూటింగ్ సమయంలో చిరంజీవితో ఆమె గొడవపడ్డారనే టాక్ ఉంది. ఇక షూటింగ్ కి ఆలస్యంగా వచ్చి శోభన్ బాబును వెయిట్ చేయించడంతో ఆయన ఫైర్ అయ్యాడట. నగ్మాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. కాగా ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరించిన గంగూలీతో నగ్మా చాలా కాలం ఎఫైర్ నడిపారనే వాదన ఉంది. వీరి రిలేషన్ పై అనేక కథనాలు ఉన్నాయి.
నగ్మా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. కాగా రోషిణి, జ్యోతిక చెల్లుళ్ళు అవుతారు. వీరి తల్లి ఒక్కరే కానీ, తండ్రులు వేరు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న నగ్మా తల్లి రెండో భర్తతో ముగ్గురు పిల్లల్ని కన్నారు. జ్యోతికను హీరో సూర్య ప్రేమ వివాహం చేసుకున్నాడు. అలా సూర్యకు నగ్మా వరుసకు వదిన అవుతుంది.
నగ్మా ప్రస్తుత వయసు 50 ఏళ్ళు. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. నగ్మాకు పెళ్లి ఆలోచన లేదని తెలుస్తుంది. 2008 తర్వాత నగ్మా సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఆమె పరిశ్రమకు కూడా గుడ్ బైక్ చెప్పింది. కుటుంబ సభ్యులతో ముంబైలో ఉంటుంది.