Vijay Hazare Trophy 2025: వర్ధమాన ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి బీసీసీ ఈ టోర్నీ నిర్వహిస్తోంది. గతంలో నిర్వహించిన ఈ టోర్నీ ద్వారానే చాలామంది ఆటగాళ్లు భారత జాతీయ జట్టులో స్థానం పొందారు. అందులో కొంతమంది తమ చోటును పదిలం చేసుకోగా.. మరి కొంతమంది చేజార్చుకున్నారు. స్థిరంగా ప్రదర్శన చేసిన వారు మాత్రం జట్టుకు చాలా సంవత్సరాల పాటు సేవలు అందించారు. ఇక ప్రస్తుతం లీగ్ దశలో ఐదు గ్రూపులలో మెరుగైన ప్రదర్శన చేసిన పది చెట్లు నాకౌట్ దశకు అర్హత పొందాయి.. లీగ్ దశలో పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, విదర్భ క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి. హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, బెంగాల్ జట్లు ప్రీ క్వార్టర్స్ దశకు చేరుకున్నాయి. ఈ నాలుగు జట్లలో రెండు క్వార్టర్స్ దశకు వెళ్తాయి..
లీగ్ దశలోనే ఇంటి ముఖం
హైదరాబాద్ (గ్రూప్ సి), ఆంధ్ర (గ్రూప్ బి) ఏడేసి మ్యాచ్ లు ఆడినప్పటికీ నాలుగింట్లో మాత్రమే విజయం సాధించి.. లీగ్ దశలోనే నిష్క్రమించాయి.. దీంతో తెలుగు అభిమానులు ఆందోళనలో కూరుకుపోయారు. తొలుత మంచి ఊపును సాధించిన జట్లు.. ఆ తర్వాత అదే స్థాయిలో ఆడ లేకపోయాయి. దీంతో వరుస ఓటములు తప్పలేదు. ఫలితంగా ఆ రెండు జట్లు ఇంటి ముఖం పట్టక తప్పలేదు. ఇక త్వరలో జరిగే నాకౌట్ మ్యాచ్ లను మొత్తం వడోదరలోనే కోటంబి స్టేడియం, మోడీ బాగా క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు. ప్రి క్వార్టర్స్ జనవరి 9న, 11న, 12 తేదీలలో జరుపుతారు. 15, 16 తేదీలలో సెమీఫైనల్స్ జరుగుతాయి. ఇక 18వ తేదీన ఫైనల్ పోరు జరుగుతుంది.
నాకౌట్ దశకు చేరిన జట్లు ఇవే
గుజరాత్ జట్టు 28 పాయింట్లు సాధించి.. గ్రూప్ – ఏ లో టాపర్ గా నిలిచింది.
విదర్భ జట్టు 24 పాయింట్ లు దక్కించుకొని గ్రూప్ – డీ లో టాపర్ గా ఆవిర్భవించింది.
కర్ణాటక 24 పాయింట్లు దక్కించుకొని గ్రూప్ – సీ లో నంబర్ వన్ గా అవతరించింది.
బరోడా 20 పాయింట్లు దక్కించుకొని గ్రూప్ – ఈ లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.
పంజాబ్ 24 పాయింట్లతో గ్రూప్ – సీ లో రెండో స్థానాన్ని సాధించింది.
హర్యానా 24 పాయింట్లతో గ్రూప్ – ఏ లో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది.
గ్రూప్ బి లో రాజస్థాన్ 20 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది.
గ్రూప్ – డీ లో తమిళనాడు 18 పాయింట్లతో రెండవ స్థానాన్ని ఆక్రమించింది.