Homeక్రీడలుక్రికెట్‌WPL 2026: ఇప్పటివరకు ఎక్కువ పరుగులు, వికెట్లు తీసింది వీరే! జాబితాలో ఎవరున్నారంటే?

WPL 2026: ఇప్పటివరకు ఎక్కువ పరుగులు, వికెట్లు తీసింది వీరే! జాబితాలో ఎవరున్నారంటే?

WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. ఈ టోర్నీలో ఢిల్లీ, బెంగళూరు జట్లు ఫైనల్ దాకా వెళ్లాయి. ఢిల్లీ జట్టు గుజరాత్ ను ఓడించి ఫైనల్ వెళ్లిపోయింది. ఇప్పటివరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేదు.

ఈసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టు అదరగొడుతున్నప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శన భాగంలో మాత్రం ఇతర జట్ల ప్లేయర్లు సత్తా చూపిస్తున్నారు. టి20 టోర్నీలలో సహజంగానే పరుగుల వరద ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈసారి టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తన బ్యాట్ సత్తా ఏమిటో నిరూపించింది.

హర్మన్ ప్రీత్ కౌర్ ఈ టోర్నీలో ఇప్పటివరకు 342 పరుగులు చేసింది. ఎనిమిది ఇన్నింగ్స్ లలో 68.40 సగటుతో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ టోర్నీలో కౌర్ మూడు హాఫ్ సెంచరీలు చేసింది.

హర్మన్ తర్వాతి స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు చెందిన నాట్ స్కైవర్ బ్రాంట్ కొనసాగుతోంది. ఈమె 7 ఇన్నింగ్స్ లలో 321 పరుగులు చేసింది. సగటు 64.20 గా ఉంది. ఈ టోర్నీలో బ్రాంట్ ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేసింది.

బెంగళూరు సారథి స్మృతి మందాన మూడో స్థానంలో కొనసాగుతోంది. స్మృతి ఎనిమిది ఇన్నింగ్స్ లలో 290 పరుగులు చేసింది. ఈమె సగటు 48.33 గా ఉంది. ఈ టోర్నీలో స్మృతి రెండు హాఫ్ సెంచరీలు చేసింది.

ఢిల్లీ జట్టు చెందిన ఎల్ లీ ఈ టోర్నీలో 9 ఇన్నింగ్స్లలో 283 పరుగులు చేసింది. సగటు 31.44 గా ఉంది. ఈమె ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఢిల్లీ జట్టుకు చెందిన లారా వోల్ వార్డిట్ 9 ఇన్నింగ్స్ లలో 273 పరుగులు చేసింది. ఈమె సగటు 45.50 గా ఉంది. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.

బౌలర్ల విషయానికొస్తే

గుజరాత్ బౌలర్ డివైన్ 9 ఇన్నింగ్స్లలో 17 వికెట్లు పడగొట్టింది. ఈమె యావరేజ్ 16.00 గా ఉంది.

రెండవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్ శర్మ కొనసాగుతోంది. ఈమె 9 ఇన్నింగ్స్లలో 16 వికెట్లు పడగొట్టింది. యావరేజ్ 17.18గా కొనసాగుతోంది.

మూడో స్థానంలో బెంగళూరు జట్టుకు చెందిన క్లర్క్ ఉంది. ఈమె 8 ఇన్నింగ్స్ లలో 15 వికెట్లు పడగొట్టింది. యావరేజ్ 13.53 గా కొనసాగుతోంది.

నాలుగు స్థానంలో ముంబై జట్టుకు చెందిన కేర్ కొనసాగుతోంది. 7 ఇన్నింగ్స్లలో ఈమె 14 వికెట్లు పడగొట్టింది. యావరేజ్ 15గా కొనసాగుతోంది.

ఐదో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ శ్రీ చరణీ ఉంది. 9 ఇన్నింగ్స్లలో ఈమె 14 వికెట్లు పడగొట్టింది. యావరేజ్ 19.7 గా కొనసాగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version