WPL 2025: శనివారం ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ గా సాగింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను మట్టి కరిపించింది. దీంతో మూడోసారి కూడా టైటిల్ దక్కించుకోవాలని ఢిల్లీ జట్టు కల నెరవేరలేదు. వరుసగా మూడు సీజన్ల పాటు ఢిల్లీ జట్టు ఫైనల్ వెళ్ళింది. అయితే ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడిని తట్టుకోలేక ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (66), నాట్ సీవర్ బ్రంట్(30) కీలకమైన పరుగులు చేసింది. ఢిల్లీ జట్టులో మరి జాన్ కాప్(2/11), జెస్ జొనాస్సెన్(2/26), శ్రీ చరణి(2/43) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. జెమీమా రోడ్రిగ్స్(30), మరిజాన్ కాప్(40), నికి ప్రసాద్ (25*) అదరగొట్టినప్పటికీ.. మిగతా ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇక ముంబై బౌలర్లలో అమేలీయ కేర్ (2/25) రెండు వికెట్లు పడగొట్టింది. నాట్ సీవర్ బ్రంట్(3/25) మూడు వికెట్లు తీసింది. షబ్నిమ్ ఇస్మాయిల్, సైక ఇషాక్, హీలి మాథ్యూస్ తలా ఒక వికెట్ సాధించాడు.
Also Read: 2027 వరకు రోహిత్ శర్మ టెస్టుల్లో కొనసాగుతాడా? బీసీసీఐ మదిలో ఏముందంటే?
మరిజాన్ అదరగొట్టినప్పటికీ..
150 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన ఢిల్లీ జట్టుకు గొప్ప ఆరంభం లభించలేదు. కెప్టెన్ మెక్ లానింగ్(13), షెఫాలి వర్మ(4) త్వరగానే అవుట్ అయ్యారు. దీంతో పవర్ ప్లే లో ఢిల్లీ జట్టు పెద్దగా ఆకట్టుకోలేదు. రెండు వికెట్లు కోల్పోయి 37 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత జెస్ జొనాస్సెస్(13), అన్న బెల్ సదర్ ల్యాండ్ (2) కూడా త్వరగానే అవుట్ కావడంతో ఢిల్లీ కోలుకోకుండా అయిపోయింది. ఈ దశలో జెమీమా పర్వాలేదని స్థాయిలో ఆడినప్పటికీ.. అమేలీయ కేర్ ఆమెను పంపించింది . సారా బ్రైస్(5) కూడా అవుట్ కావడంతో.. ఢిల్లీ జట్టు పై అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. నికి ప్రసాద్, మరిజాన్ కాప్ పోరాడినప్పటికీ.. 18 ఓవర్లో కాప్ అవుట్ అయింది. ఈ దశలో వచ్చిన శిఖా పాండే సున్నా పరుగులకు అవుట్ కావడంతో ఢిల్లీ జట్టు ఓటమి దాదాపు ఖాయమైంది. ఇక చివర్లో నికి ప్రసాద్ సిక్స్ కొట్టి అదరగొట్టినప్పటికీ.. ముంబై బౌలర్లు చివర్లో అద్భుతంగా భోజనం చేసి విజయాన్ని తగ్గించుకున్నారు.
అక్కడే మలుపు తిరిగింది..
వాస్తవానికి ముంబై జట్టు తక్కువరుగులతో కోల్పోయినప్పటికీ..నాట్ సీవర్ బ్రంట్, హర్మన్ ప్రీత్ కౌర్ మూడో వికెట్ కు 89 పరుగులు చేసింది. కేర్ విఫలమైనప్పటికీ కౌర్ దూకుడుగా ఆడింది. 33 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసింది. ఇక హార్మన్ ప్రీత్ కౌర్ భారీ షాట్ ఆడు ఎందుకు ప్రయత్నించి అవుట్ అయింది. ఇక ముంబైలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా ఆ జట్టు 149 పరుగుల వద్ద ఆగిపోయింది. వాస్తవానికి ఈ స్కోర్ అంత కఠినమైనది కాకపోయినప్పటికీ.. ఢిల్లీ జట్టు ప్లేయర్లు చేజ్ చేసే సమయంలో ఒత్తిడికి గురయ్యారు. మూడోసారి కూడా కప్ వేటలో విఫలమయ్యారు.