Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఇటీవల విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును నేల నాకించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో అన్ని రంగాలలో సత్తా చాటి.. టీమిండియా అద్భుతమైన గెలుపును తన ఖాతాలో వేసుకుంది. 2017 నాటి పరాభవాన్ని మరోసారి రిపీట్ కాకుండా చేసింది. తద్వారా 2000 లో జరిగిన నాకౌట్ టోర్నీ, 2021 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఓటమికి న్యూజిలాండ్ జట్టుపై సరైన బదులు తీర్చుకుంది. ఈ గెలుపుతో టీం ఇండియా వన్డేలలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక టి20 లలో వరుస విజయాలు సాధిస్తూ.. వరుసగా ట్రోఫీలను సొంతం చేసుకుంటూ.. టీమిండియా ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో ఉంది. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఉత్కంఠ గా సాగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించింది. ఐసీసీ టోర్నీలలో వరుసగా రెండుసార్లు టీమిండియా విజయం సాధించడం.. అది కూడా రోహిత్ ఆధ్వర్యంలో జరగడం విశేషం.
Also Read: పాక్ పరువు సింధు నది పాలు.. ఈసారి ఏం జరిగిందంటే..
రోహిత్ కొనసాగుతాడా
టీమిండియాను ఇప్పుడు మాత్రమే కాదు 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ రోహిత్ ఫైనల్ తీసుకెళ్లాడు. అయితే అప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్లోకి వెళ్లలేకపోయింది. అయితే ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత తను వన్డేలకు వీడ్కోలు ప్రకటించబోనని రోహిత్ స్పష్టం చేశాడు. మరోవైపు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు తన కొనసాగుతానని ప్రకటించాడు. డబ్ల్యూటీసి సీజన్ జూన్ నుంచి మొదలవుతుంది. ఈ క్రమంలో రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ పై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జూన్ నెలలో ఇంగ్లాండ్ జట్టుతో టీమ్ ఇండియా అయిదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ కు రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగించాలని బీసీసీఐ, సెలక్షన్ కమిటీ నిర్మించినట్టు తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్లో రోహిత్ అంతగా ఆడకపోయినప్పటికీ.. జట్టును ముందుకు నడిపించడంలో ఎటువంటి ఇబ్బంది లేదని మేనేజ్మెంట్ భావిస్తోంది. ” రోహిత్ ఏదైనా చేయగలడు. రోహిత్ నాయకత్వాన్ని బోర్డులో అందరూ సమర్థిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టుతో ఆడే టెస్ట్ సిరీస్ కు అతడే కెప్టెన్ గా ఉండాలని” బోర్డులో సభ్యులు పేర్కొన్నారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రోహిత్ నాయకత్వాన్ని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కూడా సమర్థించాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు అతడే కెప్టెన్ గా ఉండాలని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు.
Also Read: మిగతా జట్ల లాగా.. SRH కు కూడా కెప్టెన్ ను మార్చేస్తే..