World T20 Cup: భారత్ కు యూఏఈ శాపం.. పాక్ కు వరం.. టీ20 కప్ పాక్ దేనా?

World T20 Cup: కర్మకాలి భారత్ లో కరోనా తీవ్రత దృష్ట్యా ఐపీఎల్ ను, టీ20 ప్రపంచకప్ ను యూఏఈకి తరలించారు. భారత్ లో జరిగి ఉంటే కథ వేరే లెవల్లో ఉండేది. టీమిండియాకు కలిసి వచ్చేది. మన పిచ్ లలో మనకు కప్ మీద ఆశ ఉండేది. కానీ ఇక్కడ కరోనాతో యూఏఈకి ప్రపంచకప్ టీ20 తరలించడం ఇప్పుడు ఇండియాకు శాపమైంది.. పాకిస్తాన్ కు వరమైంది. 2009లో పాకిస్తాన్ లో పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెట్ […]

Written By: NARESH, Updated On : October 26, 2021 9:21 pm
Follow us on

World T20 Cup: కర్మకాలి భారత్ లో కరోనా తీవ్రత దృష్ట్యా ఐపీఎల్ ను, టీ20 ప్రపంచకప్ ను యూఏఈకి తరలించారు. భారత్ లో జరిగి ఉంటే కథ వేరే లెవల్లో ఉండేది. టీమిండియాకు కలిసి వచ్చేది. మన పిచ్ లలో మనకు కప్ మీద ఆశ ఉండేది. కానీ ఇక్కడ కరోనాతో యూఏఈకి ప్రపంచకప్ టీ20 తరలించడం ఇప్పుడు ఇండియాకు శాపమైంది.. పాకిస్తాన్ కు వరమైంది.

Virat-Kohli-Babar-Azam-AP-640

2009లో పాకిస్తాన్ లో పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెట్ టీంపై కాల్పులకు ఉగ్రవాదులు పాల్పడ్డాక అప్పటి నుంచి ఏ దేశం కూడా పాకిస్తాన్ లో ఆడడానికి రావడం లేదు. దీంతో సేఫ్ యెస్ట్ దేశమైన యూఏఈలోనే పాకిస్తాన్ విదేశీ జట్లతో మ్యాచ్ లు ఆడుతోంది. అలా నాలుగైదేళ్లలో అన్ని టీంలో ఇక్కడే ఆడేసింది. అదే పాకిస్తాన్ కు వరమైంది.

యూఏఈ పిచ్ లు పాకిస్తాన్ కు కొట్టిన పిండిలా మారాయి. వాటిని ఆవపోసన పట్టేసింది. ఇప్పటికి 13 టీ20లు యూఏఈలో ఆడిన పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడ ఓడిపోలేదంటే అతిశయోక్తి కాదు.. 13కు 13 గెలిచేసింది. విజయాలశాతం 100గా ఉంది.

అదే భారత్ కొంప ముంచింది. దుబాయ్ లో భారత్ ను చిత్తు చేసేందుకు పాకిస్తాన్ కు ఇది బాగా లబ్ధి చేకూర్చింది. అక్కడి పరిస్థితులు తెలియడంతో మొదట బౌలింగ్ చేసిన పాక్ తక్కువ స్కోరుకు టీమిండియాను కట్టడి చేసి అనంతరం ఓపెనర్లే ఛేదించి రికార్డు విజయం సాధించారు. ప్రపంచకప్ లలో ఓటమి ఎరుగని భారత్ కు దాన్ని రుచిచూపించారు. తాజాగా న్యూజిలాండ్ మ్యాచ్ లోనూ వాళ్లను కట్టిపడేసి విజయం దిశగా సాగుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫామ్ చూస్తుంటే పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రపంచకప్ టీ20 గెలిచే చాన్సులు అయితే కనిపిస్తున్నాయి. అదే జరిగితే యూఈఏకి మార్చి అక్కడ మ్యాచ్ లు ఆడుతున్న టీమిండియాకు పెద్ద షాక్ తగిలినట్టే. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.