India Vs Australia World Cup Final: ఇండియన్ టీం వరుసగా మ్యాచ్ లు ఆడుతూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తు వరుసగా 10 విజయాలను నమోదు చేయడమే కాకుండా ఫైనల్ లో ఇండియన్ టీం తమ సత్తా చూపించడానికి రెడీ అవుతుంది.ఇక ఇదే క్రమంలో ఇండియన్ టీమ్ వరుస విజయాలను సాధించినందుకు గాను, అలాగే వాళ్ళు కష్టపడి ఇండియన్ టీమ్ ను ఫైనల్ కు తీసుకు వచ్చినందుకు గాను భారత ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ మ్యాచ్ ని చూడడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఫైనల్ మ్యాచ్ తమ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతూ ఉండడం వల్ల ఆయన ఈ మ్యాచ్ చూడటానికి వచ్చి ప్లేయర్లను ఎంకరేజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఆయన ఒక్కడే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బిజెపి మంత్రులు, సీఎంలతో సహా అందరూ స్టేడియానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీంతోపాటుగా ఆస్ట్రేలియా ఉప ప్రధాని కూడా ఆస్ట్రేలియా టీమ్ ని సపోర్ట్ చేయడానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ నరేంద్ర మోడీ గనుక స్టేడియం లో కూర్చొని మ్యాచ్ చూసినట్లయితే ప్లేయర్ల మీద మరింత బాధ్యత పెరుగుతుంది.
ఎందుకంటే మన దేశ ప్రధాని చూస్తున్న మ్యాచ్ కావడం అలాగే ఆయన చేతుల మీదుగా కప్పు అందుకోవాలనే ఆరాటం అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ప్లేయర్లు మరింత బాగా ఆడాల్సి ఉంటుంది. అలాగే మోడీ కూడా ప్లేయర్లలో జోష్ నింపడానికి వాళ్లతో మ్యాచ్ కి ముందు కొద్దిసేపు మాట్లాడబొతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. కాబట్టి 1983 , 2011, 2023 వరల్డ్ కప్ లు సాధించిన ఇయర్లుగా భారత అభిమానులు ఇప్పుడే రికార్డ్ లను నమోదు చేసుకుంటున్నారు. ఇక రోహిత్ సేన అంచనాలకు మించి ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ చాలా వరకు గట్టి పోటీ ఇస్తుంది. ఎందుకంటే వాళ్లు నాకౌట్ మ్యాచ్ లు ఆడాలి అంటే చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు.
అవకాశం వచ్చిన ప్రతి ప్లేయర్ కూడా తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా టీమ్ చాలా టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది.కాబట్టి ఆ ఫైట్ ని తట్టుకొని ఇండియన్ టీమ్ నిలబడాలి అంటే ఆస్ట్రేలియా టీమ్ ని మొదటి నుంచే కట్టడి చేస్తూ రావాలి. ఇక ఒకవేళ ఏ మాత్రం చిన్న మిస్టేక్ జరిగిన ఇండియన్ టీమ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని రోహిత్ సేన క్రికెట్ ఆడటం చాలా ఉత్తమమైన పని…