Women’s World Cup 2025: ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ జట్టు సత్తా తమ ఏంటో చూపించింది… కొలంబో వేదికగా పాకిస్తాన్ తో మొదటి మ్యాచ్ ను ఆడిన బంగ్లాదేశ్ టీమ్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసి భారీ విక్టరీని సాధించింది. ఈ లెక్కన బంగ్లాదేశ్ ఉమెన్స్ టీమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మరోసారి ప్రూవ్ చేశారు…
ఇక మ్యాచ్లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ మహిళ బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి. 38.3 ఓవర్లకి 129 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. పాకిస్తాన్ జట్టు ఇంతకుముందు కొన్నిసార్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చినప్పటికి బంగ్లాదేశ్ టీం మీద ఓడిపోవడం అనేది వాళ్లకు అవమానమనే చెప్పాలి…
పాక్ మహిళా ప్లేయర్లలో రామీమ్ షమీన్ (23), ఫాతిమా సనా (22),మునీబా అలీ (17), డయానా బేగ్ (16), సిద్ర నవాజ్(15),అలియా రియాజ్ (13) పరుగులు చేశారు…వీళ్ళు మాత్రమే రెండేకెంల పరుగులు చేశారు…ఇక బంగ్లా మహిళా బౌలర్లలో షోర్నా అక్తర్ 3 వికెట్లు తీశాడు. అలాగే మహిదా అక్తర్,నహీదా అక్తర్ లు చెరో రెండు వికెట్లు తీశారు…
ఇక అనంతరం బంగ్లా మహిళా బ్యాటర్లు 130 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగారు…ఇక మొదట్లోనే ఓపెనర్ బ్యాటర్ అయిన ఫర్గాన్ 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయింది… ఆ తర్వాత కొంచెం కష్టాల్లో ఉన్న బంగ్లా జట్టును రుబియా హైదర్ హాఫ్ సెంచరీ చేసి జట్టు పరువును కాపాడటమే కాకుండా టీమ్ ను విజయ తీరాలకు చేర్చింది…
77 బంతుల్లో 54 పరుగులు చేసి నాటౌట్ నిలిచింది..31.1 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 131 పరుగులు చేసి బంగ్లాదేశ్ మహిళ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది…దీంతో ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ ఆడి అందులో విజయం సాధించి రెండు పాయింట్లతో బంగ్లాదేశ్ టీమ్ పాయింట్ల టేబుల్ లో రెండోవ స్థానాన్ని సంపాదించుకుంది…