Trisha: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే గత 20 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్లు చాలామంది ఉన్నారు వాళ్ళలో త్రిష ఒకరు…ఆమె ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో సినిమాలను చేస్తూ ప్రస్తుతం నటిగా చాలా బిజీగా ఉన్నారు… ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలతో కూడా మంచి గుర్తింపైతే వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఆమె ఇంట్లో బాంబులు పెట్టినట్టుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది.
దాంతో పోలీసులు డాగ్ స్క్వాడ్స్ అప్రమత్తమై ఇల్లు మొత్తం తనిఖీ చేశారు. అయినప్పటికి ఇంట్లో ఎక్కడ కూడా పేలుడు పదార్థానికి సంబంధించినవేమీ దొరకలేదు. దాంతో అదొక ఫేక్ కాల్ గా పరిగణించారు. అయినప్పటికి చెన్నైలోని అల్వార్ పేట్ లోని సీఎం స్టాలిన్ ఇంటి వద్ద పోలీసులు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…
ఇక ఇప్పటివరకు హీరోయిన్స్ అందరికి వచ్చిన గుర్తింపు వేరైతే త్రిషకి ఉన్న ఇమేజ్ వేరనే చెప్పాలి. ఆమె తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించింది. ఇప్పటికి నటిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా తీసుకుంటున్నారు. కాబట్టి ఆమెకు తెలుగులో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రస్తుతం తను కొన్ని సినిమాల్లో, సిరీస్ ల్లో నటిస్తూ ప్రేక్షకులకు ఎప్పుడు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు…
అయితే త్రిష ఇంట్లో బాంబులు పెట్టామని బెదిరించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది. ఆమెకు ఎవరితో అయిన శత్రుత్వం ఉందా? లేదంటే కావాలనే కొంతమంది ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఆ ఫేక్ కాల్ చేసిన వారు ఎవరో బయటకి వస్తే తప్ప ఈ మొత్తం సమస్యకు ఒక సొల్యూషన్ దొరకదు. పోలీసులు వారిని తొందరగా పట్టుకొని మీడియా ముందు ఉంచుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది…