Virat Kohli: టీ 20 ప్రపంచ క్రికెట్ టోర్నీలో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో అప్రదిష్ట మూటగట్టుకుంది. టీ20 ప్రపంచకప్ లో ఇంతవరకు పాకిస్తాన్ ఇంతవరకు విజయం సాధించలేదు. కానీ నిన్న జరిగిన ఆటలో అన్ని రంగాల్లో పాక్ దే పైచేయి అయిది. దీంతో కోహ్లీ సేన అపజయం పాలైంది. దీంతో దేశవ్యాప్తంగా అభిమానులు నిరాశకు గురయ్యారు. ఎన్నో అంచనాలతో ఉన్న భారత జట్టు ఇలా ఓటమి కోరల్లో చిక్కుకోవడం అందరిని కలచివేసింది.

ఓటమి అనంతరం భారత సారధి విరాట్ కోహ్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు జర్నలిస్టు జట్టు ఎంపికపై ప్రశ్నించడంతో కోహ్లికి కోపం వచ్చింది. కానీ తరువాత నవ్వుతూ సమాధానాలు చెప్పారు. ప్లేయింగ్ 11లో రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్ కు ఎందుకు చోటు కల్పించలేదని ప్రశ్నించడంతో కోహ్లి విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆటలో ఎన్నో వ్యయప్రయాసలు ఉంటాయని అన్నారు. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కొన్ని సార్లు విఫలం కావడం జరుగుతంది. అంత మాత్రాన ఇలా అడిగితే ఎలా అని తనలోని కోపాన్ని ప్రదర్శించాడు. గత మ్యాచుల్లో మేం ఎలా ఆడామో చూడలేదా? ఒక్కోసారి ఫలితం మారిపోతుంది. దీనికి మమ్మల్ని నిందించడం సరికాదని పేర్కొన్నారు. ఒక దశలో విలేకరి అడిగి ప్రశ్నకు తల దించుకున్నారు.
ప్రత్యర్థి ప్రదర్శనపై కోహ్లి ప్రశంసలు కురిపించారు. మేం వ్యూహాల్ని సరిగా అమలు చేయలేకపోయామని ఒప్పుకున్నారు. మా ప్రణాళికలు సరిగా పనిచేయలేకపోయాయని చెప్పారు. పాకిస్తాన్ అద్భుతమైన ప్రతిభ చూపిందని గుర్తు చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్ల ముందు మా యుక్తులు పనిచేయలేదని అన్నారు.