https://oktelugu.com/

Tollywood: 2022 సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోనున్న… పవర్ స్టార్, సూపర్ స్టార్ సినిమాలు ?

Tollywood: 2022 సంక్రాంతి కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’… వంటి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కి ముందుగానే డేట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకులంతా వారి వారి అభిమాన హీరోల సినిమాల కోసం ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు. అలానే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ఫైట్ తప్పదని సినీ విశ్లేషకులు కూడా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 25, 2021 / 10:59 AM IST
    Follow us on

    Tollywood: 2022 సంక్రాంతి కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’… వంటి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కి ముందుగానే డేట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకులంతా వారి వారి అభిమాన హీరోల సినిమాల కోసం ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు. అలానే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ఫైట్ తప్పదని సినీ విశ్లేషకులు కూడా భావించారు. అలానే వీటితో పాటు విక్టరీ వెంకటేశ్ – వరుణ్ తేజ్ కాంబోలో వస్తున్న ‘ఎఫ్3’, కింగ్ నాగార్జున ‘బంగార్రాజు’ సినిమాలు కూడా సిద్దమయ్యాయి. ఆయా సినిమాలకు సంబంధించి అఫీషియల్ గా రిలీజ్ డేట్లను కూడా ప్రకటించారు.

    ఈ నేపధ్యం లోనే దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న… ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జనవరి 7న విడుదల కాబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ కలిసి నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ లకు విశేష స్పందన లభించింది. కాగా ఈ మేరకు వచ్చే సంక్రాంతికి ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మినహా … మిగిలిన విడుదల తేదీని మార్చుకుంటున్నట్లు సమాచారం. ‘ఎఫ్3’ సినిమాను ఫిబ్రవరి 25 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

    ఇక ‘భీమ్లా నాయక్’, ‘సర్కారు వారి పాట’ సినిమాలు కూడా ఇదే బాటలో విడుదలను పోస్ట్ పోన్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేశ్ మూవీ… ఏప్రిల్ 28న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలానే మార్చి 31న భీమ్లా నాయక్ సినిమాను ధియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ నడుస్తుంది.