https://oktelugu.com/

World War III: మూడో ప్రపంచ యుద్ధం.. భయపెడుతున్న బిషప్‌ భవిష్య వాణి!

మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా.. ఇప్పటికే మొదలైందా.. ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమువుతున్న సందేహాలివే. ఇప్పటికే ఇజ్రాయెల్‌ హమాస్, లెబనాన్, ఇరాన్‌ యుద్ధం.. ఇంకోవైపు ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం.. దీంతో మూడో పపంచ యుద్ధం మొదలైందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 28, 2024 / 02:00 AM IST

    World War III

    Follow us on

    World War III: యుద్ధాలు అంటేనే ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, పేదరికంతో ప్రపంచం ఇబ్బందులు పడుతోంది. ఆర్థికమాంద్యం కారణంగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడుతున్నాయి. పేద దేశాలు కరువుతో అల్లాడుతున్నాయి. తిండిలేక ఆకలితో అలమటిస్తున్నాయి. ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. సంపదను యుద్ధాలకు ఖర్చు చేస్తే ధనిక దేశాలు కూడా పేద దేశాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే యుద్ధాలు అంటేనే చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్, హమాస్, హెజ్‌బొల్లా, ఇరాన్‌ వార్, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతోంది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచంలో దేశాలు విడిపోయాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో దేశాలు నిలిచాయి. రష్యాకు ఉత్తరకొరియా బహిరంగంగా మద్దతు ప్రకటించింది. పరోక్షంగా చాలా దేశాలు అండగా ఉన్నాయి. నాటో దేశాలు ప్రత్యక్ష యుద్ధం ప్రారంభిస్తే.. రష్యా తరఫున దేశాలు కూడా పోరాటానికి దిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఇరాన్, సిరియా, హమాస్, ఇజ్రాయెల్‌ ఇరాన్‌ మధ్య భీకర పోరు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు చైనా తైవాన్‌ మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఓ బిషప్‌ చెప్పిన భవిష్యవాణి మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

    బిషప్‌ భవిష్యవాణి..
    మూడో ప్రపంచ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ.. బిషప్‌ మార్‌ మేరి ఇమ్మాన్యుయేల్‌ చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు ప్రపంచాన్ని మరింత భయపెడుతుంది. ఈమేరక వీడియో సందేశం విడుదల చేశారు. మూడో ప్రపంచ యుద్ధం భారీ విధ్వంసాన్ని తెస్తుందని హెచ్చరించారు. ఈ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడింట ఒకవంతు కనుమరుగవుతుందని వెల్లడించారు. మిగిలిన మూడింట రెండొంతులు తాము ఇక పుట్టకూడదని కోరుకుంటారని తెలిపారు. ఈ యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్‌ గురించి బిషప్‌ వెల్లడించిన విషయాల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బాబా వెంగా, నోస్ట్రాడామస్‌ తదితర ప్రపంచ ప్రసిద్ధ భవిష్యవాణివేత్తలు కూడా ఇదే విషయాలను వెల్లడించారు.

    బిషప్‌పై దాడి..
    ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాకు చెందిన బిషప్‌ మార్‌ మేరి ఇమ్మాన్యుయేల్‌పై ఈఏడాది ఏప్రిల్‌లో దాడి జరిగింది. కత్తిపోట్లకు గురయ్యాడు. ఆయనను రక్షించే క్రమంలో అనుచరులు కూడా గాయపడ్డారు. అయితే చికిత్స తర్వాత కోలుకున్నారు. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా క్షమించరానివన్నారు. అయినా తనపై దాడిచేసిన వారిని ప్రభువు క్షమించాలని ప్రార్థించారు.