Virat Kohli Break Sachin Record: సిడ్ని వన్డేలో అర్థ శతకం చేసిన తర్వాత టీమిండియా స్టార్ బ్యాటరీ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. కానీ విరాట్ కోహ్లీ అటువంటి షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించలేదు. పైగా తాను 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతానని ప్రకటించాడు. దీంతో అతని అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. సిడ్నీ వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టడానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాడు. ఇప్పటికే అతడు శ్రీలంక ఆటగాడు కుమార సంగకర రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ రికార్డుకు అడుగు దూరంలోనే ఉండడంతో.. ఆ ఘనతను అందుకుంటాడా అనే అంచనాలు మొదలయ్యాయి.
పరిమిత ఓవర్ల ఫార్మేట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాడు. 463 మ్యాచ్లలో 18, 426 పరుగులు చేశాడు.; ఇందులో ఏకంగా 49 సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో రెండవ స్థానంలో రన్ మిషన్ కొనసాగుతున్నాడు. 305 మ్యాచ్లలో 293 ఇన్నింగ్స్ లలో 14255 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. సెంచరీల పరంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ ప్రస్తుతం టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ చేసిన శతకాలు 49… ఈ విషయంలో విరాట్ కోహ్లీ 51 సెంచరీలతో సచిన్ రికార్డును ఎప్పుడో బద్దలు కొట్టాడు.
వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల ప్రస్తుతం విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో అతడు సచిన్ రికార్డు పై గురి పెడతాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు తాను కొనసాగుతానని విరాట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ అవకాశాలు ఉన్నాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండడం పెద్ద విషయం కాదు. ఆస్ట్రేలియా గడ్డమీద తొలి రెండు వన్డేలలో అతడు విఫలమయ్యాడు. తన కెరియర్లో ఎన్నడు లేనివిధంగా 0 పరుగులకే అవుట్ అయ్యాడు. కానీ మూడో వన్డేలో మాత్రం తన మునుపటి ఆటను చూపించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆకట్టుకున్నాడు. అలాంటప్పుడు విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును బద్దలు కొట్టడం పెద్ద కష్టం కాదని.. అతడు 2027 వరకు తన సామర్థ్యాన్ని అలానే కొనసాగిస్తాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు.