Ashes 4th Test 2023 : యాషెస్ నాలుగో టెస్ట్ లో ఆసీస్ భంగపాటు తప్పదా.. ఇదేమి ఊచ కోత బాబోయ్..!

ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడితే తప్ప ఈ టెస్టులో నిలిచే అవకాశం లేదు. మరి ఆస్ట్రేలియా బ్యాటర్లు పోరాట పట్టిన ప్రదర్శిస్తారు, ఇంగ్లాండ్ బౌలర్ల ముందు తేలిపోతారో చూడాల్సి ఉంది. శుక్రవారం మూడో రోజు ఆట జరగనుంది.

Written By: BS, Updated On : July 21, 2023 11:47 am
Follow us on

Ashes 4th Test 2023 : యాషెస్ సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పట్టు బిగిస్తోంది. ఇంగ్లాండులోని మాంచేస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు అదరగొడుతున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ అదరగొట్టారు. భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్ జట్టు పయనిస్తుండడంతో ఈ టెస్ట్ పై ఇంగ్లాండ్ పట్టు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు మూడో టెస్ట్ లో ఓటమిపాలైంది. సిరీస్ లో పోటీలో నిలవాలంటే నాలుగో టెస్ట్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్ జట్టుకు ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టును 317 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లాండ్ బౌలర్లు అదరగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు తమ బజ్ బాల్ వ్యూహంలో భాగంగా వేగంగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. ఇప్పటికి 67 పరుగులు ఆధిక్యాన్ని సంపాదించింది. శుక్రవారం మూడో రోజు ఆట ప్రారంభం కావాల్సి ఉంది. క్రీజులో బెన్ స్టోక్స్ 24(37), హ్యారీ బ్రూక్ 14(41) క్రీజులో ఉన్నారు.
వేగం పెంచిన ఇంగ్లాండ్ జట్టు..
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పినట్టుగానే నాలుగో టెస్ట్ లో జోరుగా బ్యాటింగ్ సాగిస్తోంది. ఫలితాలతో సంబంధం లేకుండా బజ్ బాల్ వ్యూహాన్ని అమలు చేయడంతోపాటు మరింత వేగాన్ని చూపిస్తామని కెప్టెన్ గతంలోనే చెప్పాడు. అందుకు అనుగుణంగానే నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ఓవర్ కు 5.33 రన్ రేట్ తో ఇంగ్లాండ్ పరుగులు సాధిస్తోంది. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ జాక్ క్రావ్లే అద్భుతమైన బ్యాటింగ్ తో అధరగొట్టాడు. 182 బంతులు ఆడిన క్రావ్లే 103.85 స్ట్రైక్ రేటుతో 189 పరుగులు సాధించాడు. ఇందులో 21 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి. అలాగే మొయిన్ అలీ, జో రూట్ కూడా బ్యాట్ ఝలిపించడంతో భారీగా పరుగులు వచ్చాయి. మొయిన్ అలీ 54(82), జో రూట్ 84(95) పరుగులు చేశారు. వీరి ముగ్గురు వేగంగా పరుగులు చేయడంతో ఇలాంటి జట్టు భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతుంది. బౌలర్ ఎవరు అన్నది చూడకుండా ఇంగ్లాండ్ బ్యాటర్లు వేగంగా ఆడుతూ వీలు చిక్కునప్పుడల్లా సిక్స్ లు, ఫోర్లు కొడుతూ పరుగులు రాబట్టారు. ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉండడంతో 400కు పైగా పరుగులు చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఆస్ట్రేలియా జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది. నాలుగో టెస్ట్ లో ప్రస్తుతానికి ఇంగ్లాండ్ ఆధిక్యతలో ఉంది. ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడితే తప్ప ఈ టెస్టులో నిలిచే అవకాశం లేదు. మరి ఆస్ట్రేలియా బ్యాటర్లు పోరాట పట్టిన ప్రదర్శిస్తారు, ఇంగ్లాండ్ బౌలర్ల ముందు తేలిపోతారో చూడాల్సి ఉంది. శుక్రవారం మూడో రోజు ఆట జరగనుంది.