https://oktelugu.com/

Pawan Kalyan vs CM Jagan : జగన్ తప్పుడు కేసులు పవన్ కళ్యాణ్ కి పూలమాలలు

పవన్ ను చూసి భయపడుతూ ఇలా చేస్తున్నాడు. జగన్ తప్పుడు కేసులు పవన్ కళ్యాణ్ కి పూల మాలలుగా మారబోతున్నాయా? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : July 21, 2023 / 12:57 PM IST
Follow us on

Pawan Kalyan vs CM Jagan : చరిత్రలో ఎక్కడా కూడా నిర్బంధాలతో విప్లవాలను, మార్పులను ఆపినటువంటి ఉదంతాలు లేవు. ఈరోజు ఆంధ్రాలో పవన్ కు వస్తున్న ఆదరణను చూసి జగన్ ఏం చేయాలో తెలియక.. లోలోపల కుతకుతలాడుతూ.. చివరకు ఒక ప్యానిక్ రియాక్షన్ గా జీవో16 తీసుకొచ్చాడు. ఈ జీవో నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు.

వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్ పరిగణిస్తున్నాడా? వలంటీర్లు పబ్లిక్ సర్వెంట్లు అని జగన్ నిర్ణయించాడా? ఒక విధంగా ఇది కోర్టుల్లోకి వెళితే వీగిపోతుంది. ఈ చర్చ జరిగి వలంటీర్ల వ్యవస్థపై కోర్టులు ఏదో ఒకటి నిర్ణయిస్తాయి. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా ఇవ్వాలా.. జగన్ జీవోతోనే కోర్టులకు ఒక అవకాశం ఇచ్చారు. వలంటీర్ వ్యవస్థ మీద న్యాయపరమైన విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇలా జీవోలు ఇచ్చి వస్తున్నటువంటి ఉప్పెనలను జగన్ ఆపగలడా? అరచేతిని అడ్డుపట్టి సూర్య కాంతిని ఆపాలని జగన్ భావిస్తున్నాడు.

వారాహి యాత్రకు అడ్డంకులు పెట్టాలనే ఇలా జగన్ భావిస్తున్నాడు. పవన్ ను చూసి భయపడుతూ ఇలా చేస్తున్నాడు. జగన్ తప్పుడు కేసులు పవన్ కళ్యాణ్ కి పూల మాలలుగా మారబోతున్నాయా? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

జగన్ తప్పుడు కేసులు పవన్ కళ్యాణ్ కి పూల మాలలు || Pawan Kalyan || CM Jagan || Ok Telugu