Will Pucovski: విల్ పుకోవ్ స్కీ.. 26 సంవత్సరాల ఆస్ట్రేలియా ఆటగాడు తన కెరియర్ కు ముగింపు పలికాడు. తలకు గాయం కావడంతో.. వైద్యుల సూచనల మేరకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.. సిడ్నీ వేదికగా భారత జట్టుతో 2021లో జరిగిన టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి విల్ పుకోవ్ స్కీ ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి డేవిడ్ వార్నర్ తర్వాత స్థానాన్ని భర్తీ చేసేలాగా కనిపించాడు. ఆ సమయంలో అతడి బ్యాటింగ్ చూసి దిగ్గజ ఆటగాళ్లు గొప్పగా ఆడావంటూ ప్రశంసలు కురిపించారు. కానీ అతడి అనారోగ్యం.. కెరియర్ ను ముగించేందుకు కారణమైంది. విల్ పుకోవ్ స్కీ కి పలుమార్లు తలకు గాయాలయ్యాయి. అవి అతని కెరియర్ ముగింపునకు కారణమయ్యాయి.
అనారోగ్యం వల్ల అతను మ్యాచ్ లకు దూరమయ్యాడు. కీలకమైన మ్యాచ్ లలో అతడు ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణుల సూచనతో క్రికెట్ కు ముగింపు పలకాలని భావించాడు. ఇప్పటివరకు అతడు 13 సార్లు అనారోగ్యానికి గురయ్యాడు. ఏడాది మార్చిలో షేఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో విల్ పుకోవ్ స్కీ హెల్మెట్ కు బాల్ గట్టిగా తగిలింది. దీంతో అనారోగ్యానికి గురైన అతడు మైదానంలోకి అడుగుపెట్టలేకపోయాడు. అంతేకాదు ఇంగ్లాండ్ కౌంటి జట్టు తో తన ఒప్పందాన్ని క్యాన్సల్ చేసుకున్నాడు.
విల్ పుకోవ్ స్కీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన ఘనతలను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2021 కిడ్నీలో భారత జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 72 రన్స్ చేశాడు.. తొలి ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేశాడు.. అయితే ఆ మ్యాచ్లో అతడి భుజానికి గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకునేందుకు అతడికి ఆరు నెలల సమయం పట్టింది. ఇవి మాత్రమే కాకుండా అతడికి మానసిక సమస్యలు కూడా ఉండడంతో చాలా కాలం పాటు క్రికెట్ ఆడలేకపోయాడు..
విల్ పుకోవ్ స్కీ 21 సంవత్సరాల లోపే డబుల్ సెంచరీ చేసిన 8వ ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. ఇదే సమయంలో బ్రాడ్మన్, చాపల్, పాంటింగ్ వంటి వారి సరసన నిలిచాడు..విల్ పుకోవ్ స్కీ తన సుదీర్ఘ కెరియర్ లో 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 14 లిస్ట్ – ఏ మ్యాచ్ లు ఆడాడు. 45 సగటుతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2,350 రన్స్ చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్ – ఏ మ్యాచ్ లలో 27 సగటుతో 333 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.