Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్తాన్ బోర్డుకి అడుగడుగున నిరాశే ఎదురవుతుంది. గత సంవత్సరం జరిగిన ఆసియా కప్ లో ఇండియన్ టీం ను ఎలాగైనా పాకిస్తాన్ కి రప్పించి అక్కడ మ్యాచ్ లు ఆడించాలని ప్రయత్నం చేసినప్పటికీ అది వీలు కాలేదు. ఆసియా కప్ నుంచి మేము ఆడకుండా అయిన తప్పుకుంటాం. కానీ పాకిస్తాన్ కు మాత్రం వచ్చి మ్యాచ్ లు ఆడే ప్రసక్తే లేదని బిసిసిఐ చెప్పడంతో ఇండియా ఆడే మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు.
ఇక 2025 వ సంవత్సరంలో ఛాంపియన్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈసారి ఐసిసి నిర్వహించే ట్రోఫీ కావడం వల్ల ఇండియా పాకిస్తాన్ కు వచ్చి మ్యాచులు ఆడుతుందని పాకిస్తాన్ బోర్డు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అయినప్పటికీ ఇండియా పాకిస్తాన్ వచ్చే సమస్యే లేనట్టుగానే కనిపిస్తుంది. రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన ఐసీసీ మీటింగ్ ముగిసిన తర్వాత ఐసీసీ బోర్డు మెంబర్ మాట్లాడుతూ ‘బోర్డులో ఉన్న సభ్య దేశస్థులు వాళ్ల సమస్యలని విన్నవించుకోవడానికి అవకాశం ఉంది.
కానీ వాళ్ల (బిసిసిఐ) ప్రభుత్వం అక్కడ ఆడడానికి ఇష్టపడకపోతే మాత్రం ఐసిసి కూడా వాళ్లను బలవంత పెట్టే అవకాశం అయితే లేదు’. వాళ్ళకోసం ప్రత్యామ్నాయమైన వేదికలను నిర్వహించే అవకాశం ఉంటుంది అని తను చెప్పడంతో పాకిస్తాన్ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయింది. ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇండియా ఆడే మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది…
గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియా పాకిస్తాన్ లో పర్యటించడం లేదు. వాళ్లు చేసే అరాచకాలను ఎండగడుతూ వాళ్ల దేశంలో ఆడేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదు. దానివల్లే అక్కడ ఈ దేశం కూడా మ్యాచ్ లు అడటం లేదు. అందుకోసమని ఎలాగైనా ఇండియాని తమ దేశానికి తిరిగి రప్పించి మ్యాచ్ లు ఆడిస్తే మిగితా దేశాలు కూడా పాకిస్థాన్ లో మ్యాచులు ఆడుతాయి అనే ఉద్దేశ్యం తోనే పాకిస్తాన్ బోర్డు ఇండియా ని వాళ్ల దేశానికి రప్పించాలని చూస్తుంది. కానీ బిసిసిఐ మాత్రం దానికి సస్యమేరా ఒప్పుకోవడం లేదు…