https://oktelugu.com/

Chandrababu: ఏపీలో ఎన్నికల జాప్యం వెనుక చంద్రబాబు?

గత ఎన్నికలు కూడా సుదీర్ఘకాలం కొనసాగాయి. అప్పట్లో అధికారపక్షంగా ఉన్న టిడిపికి ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. వైసీపీకి మాత్రం కలిసి వచ్చింది. అప్పట్లో బీజేపీతో టిడిపి విభేదించడం వల్లే ఎన్నికల ప్రక్రియలో వైసీపీకి సహకారం అందింది.

Written By: , Updated On : March 17, 2024 / 10:33 AM IST
Chandrababu

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబు సక్సెస్ అయ్యారా? ఏపీ ఎన్నికలు చివరి విడతలో జరగాలని కోరుకున్నారా? ఆ మేరకు బిజెపి నుంచి సహకారం అందిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది.నిన్న ఎలక్షన్ కమిషన్ సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లోక్సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీ కు సంబంధించి మీ 13న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నాలుగో విడతలో భాగంగా ఏపీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సుదీర్ఘ జాప్యం వెనుక చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీపై వ్యతిరేకత పెంచడంతో పాటు కూటమి అభ్యర్థుల విషయంలో అసంతృప్తులను దారిలోకి తెచ్చుకునేందుకు ఇదో మంచి ఛాన్స్ గా చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికలు కూడా సుదీర్ఘకాలం కొనసాగాయి. అప్పట్లో అధికారపక్షంగా ఉన్న టిడిపికి ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. వైసీపీకి మాత్రం కలిసి వచ్చింది. అప్పట్లో బీజేపీతో టిడిపి విభేదించడం వల్లే ఎన్నికల ప్రక్రియలో వైసీపీకి సహకారం అందింది. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే ప్రణాళికతో ముందుకు సాగారు. తనకు ఎదురైన పరిణామాలను గుణపాఠంగా మార్చుకుని ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే మేలో మలి విడత ఎన్నికలు ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ సామాన్య ప్రజలు మాత్రం మరీ ఇంత ఆలస్యమా అన్నట్టు నిట్టూర్చుతున్నారు. అంతకాలం ఎన్నికల ఖర్చు భరించాలంటే కష్టం అనే మాట వినిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఖుషి అవుతోంది. ఎన్నికల జాప్యం వెనుక చంద్రబాబు ఉన్నారంటూ టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు పథకాలు పెండింగ్లో ఉన్నాయి. కొన్నింటికి జగన్ జీవోలు ఇచ్చారు. కానీచాలామంది లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ కాలేదు. సహజంగానే ఇది అసంతృప్తికి దారితీస్తుంది. గతానికి భిన్నంగా చంద్రబాబు ముందుగానే మెజారిటీ సీట్లను ప్రకటించారు. అటు కూటమి కట్టడంతో దాదాపు 31 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలను వదులుకోవడంతో సహజంగానే పార్టీలో ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. దానిని సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం అవసరం. అందుకే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల్లో జాప్యం చేయించారన్న టాక్ మాత్రం వినిపిస్తోంది. అయితే ఒత్తిడితోనే నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తున్నారా? లేక సహజంగానే ఆలస్యమైందా? అన్నది ఎన్నికల అధికారులకే తెలియాలి. టిడిపి నేతలు మాత్రం చంద్రబాబు ఉన్నారన్న ప్రచారం చేస్తున్నారు. వైసిపికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.