Boycott ODI World Cup: బీసీసీఐ కార్యదర్శిగా రెండోసారి పదవి బాధ్యతలు అందుకున్న జై షా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య వైరాన్ని మరింత పెంచేలా కనిపిస్తోంది. ఈ వివాదానికి కారణం షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ లో జరగాల్సిన టోర్నీ లో తాము బరిలోకి దిగబోమంటూ వ్యాఖ్యానించడమే. తటస్థ వేదికల పై నే తలపడతామంటూ జై షా అన్న మాటలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అంతే దీటుగా స్పందించింది. ఆసియా కప్ లో ఆడకుంటే వచ్చే ఏడాది భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసింది. జై షా వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా తీవ్రంగా స్పందించాడు. అతడి వ్యాఖ్యలు ప్రపంచ క్రికెట్ బోర్డులో చీలికలు తెచ్చే విధంగా ఉన్నాయన్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అత్యవసర భేటీ నిర్వహించి సమస్యను పరిష్కరించాలని సూచించాడు. వాస్తవానికి వచ్చే సంవత్సరం ఆసియా కప్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. దీనిపై ఇప్పటివరకు బీసీసీఐ మౌనంగా ఉంది. అయితే గడచిన మంగళవారం వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా జై షా ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించబోదని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసియా కప్ లో ఇప్పటికీ ప్రధాన జట్లుగా శ్రీలంక, భారత్ ను పరిగణిస్తారు.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు అంటే అభిమానులు ఉర్రూతలూగుతారు. ఇక పాకిస్తాన్, భారత దేశాల మధ్య ఉన్న వైరం వల్ల రెండు జట్లు తటస్థ వేదికల పైనే తలపడ్డాయి. దశాబ్ద కాలంగా ఇది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఊసే లేదు. అయితే పిసిబి హెచ్చరికలను జై షా ఏ మేరకు స్వీకరిస్తాడనేది వేచి చూడాలి.

పాకిస్తాన్ కు ఆసియా హక్కులు
2023 లో ఆసియా కప్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. గత ఆసియా కప్ ను శ్రీలంక నిర్వహించాల్సి ఉండగా.. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా యూఏఈ లో నిర్వహించారు. అది కూడా ఫార్మాట్ లో నిర్వహించారు. 2018లో భారత్ లో నిర్వహించాల్సిన ఆసియా కప్ కూడా యూఏఈ లో నిర్వహించారు. పాకిస్తాన్ క్రికెటర్ల భద్రతపై భారత ప్రభుత్వం తగినంత హామీ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఉగ్ర చేసినందుకు గానూ పాకిస్తాన్ తో భారత్ సంబంధాలు తెంపేసుకుంది. దీని ప్రభావం ఇరు జట్ల క్రికెట్ సంబంధాలపై కూడా చూపింది. భారత జట్టు చివరిసారిగా పాకిస్థాన్ లో 2008లో పర్యటించింది. పాక్ 2012_13 లో భారత్ లో ఆడింది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లో జరిగింది లేదు. ఈ నేపథ్యంలో జై షా నిర్ణయం ఏకపక్షంగా ఉందని సన్ క్రికెట్ బోర్డు మండిపడింది. ఆసియా కప్ నిర్వహణ హక్కు తమకు కట్టబెట్టినప్పుడు ఎసిసిలోని సభ్య దేశాలు తమకు మద్దతు తెలిపాయని, ఇప్పుడు జై షా ఏకపక్ష నిర్ణయంతో ఎసిసిలోనూ విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉందని పిసిబి ఆందోళన వ్యక్తం చేసింది. తమను సంప్రదించకుండానే వేదిక మారుస్తామని జై షా అనడంపై పిసిబి అభ్యంతర వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రసార హక్కులు, ఇతర వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకున్నామని, ఈ తరుణంలో వేదిక మార్పు ఆర్థికంగా తమను దెబ్బతీస్తుందని పిసిబి వాపోయింది. వేదిక మార్పు విషయమే తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని, అందుకే ఎసిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని పిసిబి డిమాండ్ చేసింది.
మెల్ బోర్న్ లో లేవనెత్తాలని..
వచ్చే నెలలో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఐసీసీ బోర్డు సమావేశం కానుంది. ఆ భేటీలో ఈ విషయాన్ని లేవనెత్తాలని పిసిబి అనుకుంటున్నది. షా చేసిన వ్యాఖ్యల పై ఇంతవరకు ఐసీసీ కూడా స్పందించలేదు. భారత్, పాకిస్తాన్ జట్లలో ఏ ఒక్కటీ లేకపోయినా టోర్నీలకు అర్థం లేదని, అందుకే ఈ వివాదాన్ని ఇరు దేశాల బోర్డులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఏ సీసీ సభ్యుడు ఒకరు తెలిపారు. ఆసియా కప్ మ్యాచ్ లను తటస్థ వేదికలపై నిర్వహించేందుకు పీసీబీ సుముఖంగా లేదు. చాలాకాలం తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ దేశాలు తమ గడ్డపై ఆడినప్పుడు చెప్పని అభ్యంతరం.. ఇప్పుడు భారత జట్టు ఎందుకు లేవనెత్తుతోందని పిసిబి వాదిస్తోంది. బీసీసీఐ వ్యాఖ్యలు ఎసిసి క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శిస్తోంది. ఆసియా కప్ లో ఆడేందుకు భారత జట్టు నిరాకరిస్తే.. భారత దేశం నిర్వహించే ప్రపంచ కప్ పోటీలకు తమ జట్టును పంపించబోమని పిసిబి స్పష్టం చేస్తోంది.
బీసీసీఐ ఏమంటుంది అంటే
ఎవరు ఎన్ని చెప్పినా పాకిస్తాన్ అనేది ఉగ్రవాద దేశం. గతంలో శ్రీలంక క్రీడాకారులు పాకిస్థాన్లో పర్యటించినప్పుడు ఉగ్రవాదులు ఏ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేశారో ప్రపంచం మొత్తం చూసింది. ఇక అప్పటినుంచి పాకిస్తాన్లో మొన్నటి వరకు ఏ దేశమూ పర్యటించలేదు. పాకిస్తాన్లో తమకు భద్రతాపరంగా ఇబ్బందులు ఉన్నాయని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.. భారతదేశం మీద మీద అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పాకిస్తాన్ తో జరిగే ద్వైపాక్షిక సిరీస్ లు లేదా, పాకిస్తాన్లో పర్యటించడం చాలా సమస్యాత్మకమని బీసీసీఐ వాదిస్తోంది. అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావాలని చెబుతోంది. భద్రత కారణాల దృష్ట్యానే తటస్థ వేదికల మీద మాత్రమే ఆసియా కప్ నిర్వహించాల్సి ఉంటుందని జై షా స్పష్టం చేశారు. భారత జట్టు పాకిస్తాన్ కు, పాకిస్తాన్ జట్టు భారత్ కు రాలేరని జై షా వెల్లడించారు. గతంలో కూడా ఆసియా కప్ తటస్థ వేదికపైనే జరిగిందని గుర్తు చేశారు. కాగా 2023లో ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో జరుగుతుంది.