Shreyas Iyer Asia Cup: ఆసియా కప్ లో శ్రేయస్ అయ్యర్ కు చోటు లభించకపోవడంతో అతడి అభిమానులు భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దల మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేరళ వాసులు అయితే గౌతమ్ గంభీర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా అయ్యర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్దిరోజులుగా శ్రేయస్ అయ్యర్ పేరుతో వేలాది ట్వీట్స్ చేస్తూ ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఎక్కడ వరకు దారితీస్తుందో తెలియదు గానీ.. మొన్నటి నుంచి మొదలు పెడితే ఒక ఉద్యమం లాగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం కొనసాగుతోంది.. అయ్యర్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐపీఎల్ లో అదరగొట్టినప్పటికీ ఆఖరికి చోటు లభించకపోవడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు పెద్దలు, గౌతమ్ గంభీర్ కలిసి అయ్యర్ జీవితంతో ఆడుకుంటున్నారని మండిపడుతున్నారు.
Also Read: అయ్యర్ కోసం రంగంలోకి ప్రీతిజింటా.. బీసీసీఐ తో ఢీ!
అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అయ్యర్ ను ఆసియా కప్ కు సంబంధించి దూరం పెట్టడంలో వేరే కారణం ఉందట. అయ్యర్ ను ఆసియా కప్ కు దూరం పెట్టి.. వచ్చే వన్డే సిరీస్ లో అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా కు వన్డే జట్టు సారధిగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఇటీవల సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. వచ్చే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించాలని భావిస్తున్నాడు. అయితే యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా ఛాంపియన్ గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అలాంటప్పుడు అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించి.. జట్టుకు వన్డే వరల్డ్ కప్ అందించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది గనుక నిజమైతే అయ్యర్ అభిమానులకు పండగ లాంటి వార్తే.