Prakash Raj Tweet Pawan Kalyan: నటుడు ప్రకాష్ రాజ్( cine actor Prakash Raj) చాలా లాజిక్ గా మాట్లాడుతారు. లాజికల్ ట్విస్టులు ఇస్తారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ అలానే ఉంది. ఎప్పుడూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పెట్టే ఆయన ఈసారి.. అదే పవన్ కళ్యాణ్ కు భవిష్యత్తులో దక్కబోయే పదవి గురించి పరోక్షంగా సందేశం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ కేసుల్లో అరెస్టు అయి జైలు పాలైన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని అయినా నెల రోజులపాటు జైల్లో ఉంటే పదవులు కోల్పోయేలా కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అయితే దీని వెనుక బిజెపి అంతుపట్టని వ్యూహాలు ఉన్నాయని ప్రజల్లో బలమైన చర్చ నడుస్తోంది. అయితే దాని వెనుక ఉన్న మర్మాన్ని బయటపెట్టారు నటుడు ప్రకాష్ రాజ్. ఏపీ రాజకీయాలతో ముడి పెడుతూ ఆయన పోస్ట్ ఉంది. ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: టిడిపి ఎమ్మెల్యేలకు వైసీపీ ట్రాప్.. చంద్రబాబు సీరియస్!
బిల్లుపై వ్యతిరేకత..
కేంద్ర ప్రభుత్వం( central government) పెట్టిన ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎలాగైనా ఆమోదించేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. విపక్ష ప్రభుత్వాలు ఉన్నచోట.. బలవంతంగా అధికార మార్పిడి కోసమే బిజెపి ఈ బిల్లును తెస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార యాత్ర చేపడుతున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దాని నుంచి దృష్టి మళ్లించేందుకు బిజెపి కొత్త బిల్లు తెస్తోందన్న అనుమానం కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలకు ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సంచలన ట్వీట్ చేశారు నటుడు ప్రకాష్ రాజ్.
మూడు పార్టీలు జత కలిసి..
మొన్నటి ఎన్నికల్లో ఏపీలో ( Andhra Pradesh)మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. తొలుత బిజెపితో జనసేన జతకట్టింది. ఆ రెండు పార్టీలు పోటీ చేస్తే ఫలితం ఉండదని భావించింది. క్షేత్రస్థాయిలో బలమున్న తెలుగుదేశం పార్టీని కలుపుకొని వెళితేనే అధికారం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే మూడు పార్టీలు కలిసి పోటీచేసాయి. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. బిజెపి సైతం అధికారాన్ని పాలు పంచుకుంటుంది. అయితే ఎప్పటికైనా జనసేనతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బిజెపి ప్రయత్నిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే దానిని ఉటంకిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ ఉంది.
Also Read: చంద్రబాబు సీరియస్.. సీఎంనైనా వదలమంటున్న పవన్!
చిలిపి సందేహం అంటూ..
ఒక చిలిపి సందేహం అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ ప్రారంభించారు. మహాప్రభు తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ బిల్లు వెనుక.. మాజీ ముఖ్యమంత్రి కానీ.. ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి.. నీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అడ్డును ఈ బిల్లు ద్వారా తొలగించి.. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలన్న ప్రయత్నమా అన్నట్టు ప్రకాష్ రాజు ట్వీట్ ఉంది. విపరీతంగా ఇది వైరల్ అవుతోంది.
ఒక చిలిపి సందేహం
మహాప్రభు .. తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక , మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినె ఉపముఖ్యమంత్రిని” ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా ??? #justasking #newbill #parliament pic.twitter.com/3sbPGazzGj
— Prakash Raj (@prakashraaj) August 22, 2025