Why KL Rahul Left Lucknow: భారత క్రికెట్ జట్టులో అత్యంత నిశ్శబ్దమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు కేఎల్ రాహుల్. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. ప్రత్యర్థి బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ తనలో ఉన్న అసలైన ఆటగాడిని బయటికి తీస్తాడు. డిఫెన్స్ నుంచి మొదలుపెడితే దూకుడు వరకు అన్ని రకాల క్రికెట్ టెక్నిక్ లను ప్రదర్శిస్తాడు. అందువల్లే కేఎల్ రాహుల్ మోడ్రన్ క్రికెట్ వాల్ అయిపోయాడు.
కేఎల్ రాహుల్ కు టీమిండియాలోనే కాకుండా ఐపిఎల్ లో కూడా మంచి రికార్డు ఉంది. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఇతడు కీలక ఆటగాడు. వాస్తవానికి ఇతడు 2024 సీజన్ వరకు లక్నో జట్టుకు నాయకత్వం వహించాడు. లీగ్ దశలో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో దారుణంగా ఓడిపోయింది. ఆ సమయంలో మైదానంలో ఉన్న లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక తో కేఎల్ రాహుల్ కు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అతడు జట్టును విడిచిపెట్టి వెళ్ళాడు. ఈ పరిణామం ఊహించిందే. వాస్తవానికి దీని వెనుక జరిగిన విషయం చాలామందికి తెలియదు. అయితే ఇన్నాళ్లకు ఆ విషయాన్ని రాహుల్ బయట పెట్టాడు.
Also Read: SRH కొత్త కెప్టెన్ అతనే.. యాజమాన్యం సంచలన ప్రకటన
సంజీవ్ తో జరిగిన గొడవను నేరుగా ప్రస్తావించకుండా.. పరోక్షంగా విమర్శలు చేశాడు. ఐపీఎల్ తో సంబంధం లేని వ్యక్తులకు.. సంబంధం లేని విషయాలకు కెప్టెన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని రాహుల్ పేర్కొన్నాడు.. “పది మాసాలు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతాం. రెండు నెలలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు కేటాయిస్తాం. అయితే నేను మాత్రం ఐపీఎల్ విషయంలో తీవ్రంగా అలసిపోయాను. సారధిగా ఇప్పటికైనా కష్టపడ్డాను. నిత్యం సమీక్షలలో పాల్గొనాలి. యాజమాన్యానికి వివరణ ఇవ్వాలి. కోచ్ లు, అసిస్టెంట్ కోచ్ లు చాలా వివరాలు అడుగుతారు. వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ లో అలా ఉండదు. ఆట తెలిసినవారు అడిగితే సమాధానం స్పష్టంగా చెప్పొచ్చని” రాహుల్ వ్యాఖ్యానించాడు.
రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం స్పోర్ట్స్ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి సంజీవ్ చేసిన విమర్శలు రాహుల్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. దీంతో అతడు జట్టను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇదే విషయాన్ని మేనేజ్మెంట్ కు మొహమాటం లేకుండా చెప్పాడు. అప్పట్నుంచి అతడు గుండెల నిండా బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. తాజాగా తన ఆవేదనను ఓ ఇంటర్వ్యూలో ఇలా వెల్లడించాడు.
Also Read: నేను ఎంత గొప్పగా ఆడినా మా నాన్న కు సంతృప్తి లేదు
కె.ఎల్ రాహుల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ జట్టుకు వచ్చాడు. ఢిల్లీ జట్టు యాజమాన్యం ఇతడికి కెప్టెన్సీ ఇస్తానని చెప్పింది. అయితే తనలో ఉన్న ఆటగాడిని మరింత నైపుణ్యవంతుడిని చేయాలని భావించిన అతడు మేనేజ్మెంట్ విజ్ఞప్తిని తీరస్కరించాడు. గత సీజన్లో సొంత మైదానంలో అతడు బెంగళూరు జట్టు మీద చెలరేగి ఆడాడు. అతడు ఆడిన ఇన్నింగ్స్ 2025 ఐపీఎల్ లో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది.