SRH New Captain: ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి మినీ వేలం మరి కొద్ది రోజుల్లో జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జట్ల యాజమాన్యాలు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. కొన్ని జట్లు సారధులను మార్చే పనిలో ఉన్నాయి. ప్లేయర్ల విషయంలో కూడా రిలీజ్ విధానాన్ని పాటించాయి. రిటైన్ విధానాన్ని కూడా కొనసాగించాయి. త్వరలో జరిగే మినీ వేలంలో అన్ని జట్లు కొత్త ప్లేయర్లను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ మినహా మిగతాన్ని జట్లు కూడా తమ పర్స్ వేల్యూ ను భారీగా పెంచుకున్నాయి.
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ జట్టు గడిచిన సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ. . ఈ సీజన్లో అంచనాలకు మించి రాణించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్లేయర్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో కొంతమంది భీకరమైన ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. కొంతమంది ప్లేయర్లను రిలీజ్ చేసింది. దీంతో ఆ జట్టు పర్స్ వేల్యూ పెరిగింది. అయితే మినీ వేలంలో యంగ్ ప్లేయర్లను కొనుగోలు చేయాలని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది.
ఇదే సమయంలో హైదరాబాద్ జట్టు కొత్త సారధిని నియమిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై యాజమాన్యం స్పందించింది. వచ్చే ఐపిఎల్ సీజన్లోనూ కమిన్స్ ఉంటాడని మేనేజ్మెంట్ ప్రకటించింది.. సోషల్ మీడియాలో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అతడి సారథ్యంలో 2024 సీజన్లో హైదరాబాద్ జట్టు ఫైనల్ వెళ్ళింది.. కమిన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు 30 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 15 గెలిచింది. 14 మ్యాచ్ లలో ఓటమిపాలైంది. ఒకదానిలో ఫలితం లేదు. ఇతడిని హైదరాబాద్ జట్టు యాజమాన్యం 20.50 కోట్లకు కొనుగోలు చేసింది.
కమిన్స్ నాయకత్వంలో హైదరాబాద్ జట్టు గత సీజన్లో అంతగా ఆడలేకపోయింది. ఈసారి అంతకుమించిన స్థాయిలో ఆడాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే యాజమాన్యం జట్టుకు భారంగా ఉన్న ప్లేయర్లను పక్కనపెట్టింది.. మినీ వేలంలో సమర్థవంతమైన ప్లేయర్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్ జట్టు పర్స్ వ్యాల్యూ 20+ కోట్లకు మించి ఉంది. వీటి ద్వారా సమర్ధవంతమైన ప్లేయర్లను కొనుగోలు చేసి.. 2026 సీజన్లో ఛాంపియన్ కావాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. ప్లేయర్ల విషయంలో కూడా తీవ్రమైన కసరత్తు చేస్తోంది..