Shreyas Iyer Controversy: టన్నులకొద్ది ప్రతిభ ఉంది. జట్టును నడిపించే సామర్థ్యం ఉంది.. రంజీలో దుమ్మురేపిన నేపథ్యం ఉంది. ఐపీఎల్ ట్రోఫీ అందించిన సత్తా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగుల వరద పారించిన దమ్ముంది. పంజాబ్ జట్టును ఫైనల్ తీసుకెళ్లిన తెగువ ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టే శ్రేయస్ సమకాలీన క్రికెట్లో తిరుగులేని ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
Also Read: గిల్ కు ప్రమోషన్, అతడికి షాక్.. ఆసియా కప్ కు టీమిండియా ఇదే!
ఇటువంటి ఆటగాడు మరే జట్టులో ఉన్నా కళ్ళ కద్దుకొని తీసుకుంటారు. అతడికి విరివిగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు. కానీ మన క్రికెట్ జట్టు లో ఉన్న రాజకీయాల వల్ల అయ్యర్ కెరియర్ ఒడిదుడుకులకు గురవుతోంది. కోచ్ గౌతమ్ గంభీర్ అతడి మీద కక్ష కట్టాడని.. అందువల్లే అవకాశాలు రావడంలేదని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే శ్రేయస్ అయ్యర్ కు విపరీతమైన మద్దతు లభిస్తోంది.
ప్రీతి జింటా జట్టు సారధికి ఆసియా కప్ లో అవకాశం లభించకపోవడం పట్ల.. ఎవరికి పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా స్పందించింది. నేరుగా వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ పరోక్షంగా విధానం మీద నమ్మకం ఉంది అన్నట్టుగా ఒక ట్వీట్ చేసింది. అందులో అయ్యర్ బ్యాక్ పట్టుకుని మైదానంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నట్టుగా ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసింది. దీనిని బట్టి శ్రేయస్ అయ్యర్ విషయంలో మేనేజ్మెంట్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడిందనే సందేశాన్ని పంజాబ్ జట్టు యాజమాన్యం వ్యక్తం చేసిందని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఒక ఆటగాడికి సంబంధించి ఐపీఎల్లో ఏ జట్టు యాజమాన్యం కూడా ఈ స్థాయిలో ఇటీవల కాలంలోనే కాదు, గతంలో కూడా ఎన్నడూ స్పందించలేదు.
Also Read: శ్రేయాస్ అయ్యర్ కి మళ్లీ అన్యాయం.. గంభీర్ ఉండగా చోటు కష్టమేనా?
వాస్తవానికి అయ్యర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఫీల్డింగ్ విషయంలో అతనికి వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి స్థానంలో వచ్చిన సరే బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు. పరుగుల వరద పారిస్తుంటాడు. జట్టు ఎటువంటిదైనా సరే.. ప్రత్యర్థి బౌలర్ ఎంతటి భయంకరుడైన సరే ఏమాత్రం వెనుకంజ వేయకుండా బ్యాటింగ్ చేసే నైపుణ్యం అయ్యర్ సొంతం. అందువల్లే అతడు సమకాలీన క్రికెట్లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. అందువల్లే సోషల్ మీడియా అతడికి అండగా నిలుస్తోంది. అతని కోసం ఏకంగా ఉద్యమాలు కూడా చేస్తోంది. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయ్యర్ విషయంలో మేనేజ్మెంట్ ఏం చేస్తుందనేది చూడాల్సి ఉంది.