Ram Charan And Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోల్లో చిరంజీవి మొదటి స్థానం లో ఉంటాడు…తను చేసిన సినిమాలతో మెగాస్టార్ గా ఎదిగాడు. చిరంజీవి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలో మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన నటనతో గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే తన నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలతో పాన్ వరల్డ్ లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఇప్పటివరకు ఆయన కెరీర్ అనేది సాఫీగా సాగుతోంది. చిరంజీవి తర్వాత నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకునేది రామ్ చరణ్ ఏనా లేదంటే ఇతర హీరోలు కూడా అతనికి పోటీని ఇస్తూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఎవరికి ఈ నెంబర్ వన్ పొజిషన్ దక్కుతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
Also Read: రాజమౌళి దెబ్బకి మరోసారి టికెట్ రేట్లు పెరగబోతున్నాయా..?
అయితే రామ్ చరణ్ కి మెగాస్టార్ చిరంజీవిలో అన్ని క్వాలిటీస్ నచ్చినప్పటికి ఒక్కటి మాత్రం అతన్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుందట. అది ఏంటి అంటే చిరంజీవి నటించేటప్పుడు మంచి నటన వచ్చినా కూడా మరోసారి ఇంకోటి తీసుకుందామని చెప్పి దానికంటే బెటర్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట.
దీనివల్ల మొదటిది బెటర్ గా వచ్చిన కూడా ఆయన సాటిస్ఫై అవ్వలేక మరికొన్ని టేక్స్ ని తీసుకుంటూ ఇంకా దానికంటూ గొప్పగా రావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడట. అయితే అది అన్నివేళలా వర్కౌట్ అవ్వదు కొన్ని సందర్భాల్లో మొదటి టేక్ సూపర్ గా వస్తుంది. మనం ఇంకో టేక్ లో దానికంటే బెటర్ గా ప్రయత్నం చేసినప్పుడు అది కుదరకపోవచ్చు. బెటర్ గా వచ్చిన దాన్నే తీసుకోవడం మంచిది అని రాంచరణ్ నమ్ముతాడు. కానీ చిరంజీవి మాత్రం మొదటి దానికంటే సెకండ్ టేక్ ఇంకా బెటర్ గా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడట.
అందువల్లే ఆ ఒక్క క్వాలిటీ రామ్ చరణ్ కి నచ్చదట…చిరంజీవి అలా చేస్తూ వచ్చాడు కాబట్టే తను మెగాస్టార్ గా బెస్ట్ యాక్టర్ గా ఎదిగాడని మరి కొంతమంది చెబుతున్నారు… ఇక ఎవరి మెంటాలిటీ వాళ్లకు ఉంటుంది కాబట్టి రామ్ చరణ్ కి బెస్ట్ టేక్ వస్తే తను అక్కడితో ఆగిపోతాడు కానీ చిరంజీవి మాత్రం ఇంకా బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది అతని నైజం…