https://oktelugu.com/

ఎంఎస్ ధోని అంటే ఎందుకంత పిచ్చంటే?

మహేంద్రసింగ్ ధోని.. కపిల్ దేవ్ తర్వాత ఆయనను మించి భారత క్రికెట్ జట్టుకు మూడు కప్పులు అందించి టెస్టుల్లో నంబర్ 1కు చేర్చిన గొప్ప కెప్టెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. అలాంటి ధోని కెప్టెన్ గా వైదొలిగి సామరస్యంగా కోహ్లీకి పగ్గాలు అప్పగించాడు. పోయిన వన్డే ప్రపంచకప్ లో వైఫల్యంతో ఇక శాశ్వతంగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే ధోని రిటైర్ మెంట్ పై క్రికెట్లంతా షాక్ అయ్యారు. ధోని ఎందుకు అంత గొప్ప […]

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2021 / 12:36 PM IST
    Follow us on

    మహేంద్రసింగ్ ధోని.. కపిల్ దేవ్ తర్వాత ఆయనను మించి భారత క్రికెట్ జట్టుకు మూడు కప్పులు అందించి టెస్టుల్లో నంబర్ 1కు చేర్చిన గొప్ప కెప్టెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. అలాంటి ధోని కెప్టెన్ గా వైదొలిగి సామరస్యంగా కోహ్లీకి పగ్గాలు అప్పగించాడు. పోయిన వన్డే ప్రపంచకప్ లో వైఫల్యంతో ఇక శాశ్వతంగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

    అయితే ధోని రిటైర్ మెంట్ పై క్రికెట్లంతా షాక్ అయ్యారు. ధోని ఎందుకు అంత గొప్ప కెప్టెన్ అయ్యారు? మ్యాచ్ లను గెలిపించేలా తయారయ్యాడన్నది కథలు కథలుగా చెబుతున్నారు.

    ధోని కుర్రాళ్లను ఎంకరేజ్ చేస్తాడని.. మార్గ నిర్ధేశం చేసి మ్యాచ్ లకు సన్నద్ధం చేస్తాడని భారత బౌలర్ భువనేశ్వర్ తెలిపాడు. ధోని సారథ్యంలోనే తాను జాతీయ స్థాయి బౌలర్ గా ఎదిగానని గుర్తు చేశాడు. అందరికీ సాయం చేసే గొప్ప కెప్టెన్ ధోని అన్నాడు. అందుకే ఏ క్రికెటర్ అయినా సరే ధోనిని అమితంగా ఆరాధిస్తాడని.. అతడిని ఒక గురువుగా భావిస్తారని తెలిపాడు.

    నిజంగానే ధోని సారథ్యంలోనే చాలా మంది వెలుగులోకి వచ్చారు. ఇప్పటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ , భువనేశ్వర్, రిషబ్ పంత్ లాంటి వారిని తీర్చిదిద్దింది మన ధోనినే. నిస్వార్థంగా పాలిటిక్స్ దూరంగా ఆటగాడిలోని ఆటను మాత్రమే చూసాడు కనుకే ధోని భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడని చెప్పొచ్చు.