Sunrisers: కీలక ప్లేయర్ ను ఎందుకు తప్పించినట్లు?

Sunrisers: త్వరలోనే ఐపీఎల్ 2022 సంగ్రామం జరుగబోతుంది. మొత్తం పది జట్లు పాల్గొనేలా ఐపీఎల్ నిర్వాహాకులు ప్లాన్ చేస్తున్నారు. గత ఐపీఎల్ మ్యాచులతో పోలిస్తే మరింత రసవత్తరంగా మ్యాచులను తీర్చిదిద్దేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే జనవరిలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలంపాటలకు బీసీసీఐ సమాయత్తం అవుతోంది. ఐపీఎల్ మెగా వేలంపాటలకు ముందే ఆయా ప్రాంచైజీ జట్లు కీలక ఆటగాళ్లను అంటిపెట్టుకునే  అవకాశం నేటితో ముగిసింది. గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను ఆయా జట్లు తమతో ఉంచుకునే వెలుసుబాటు […]

Written By: NARESH, Updated On : December 2, 2021 10:50 am
Follow us on

Sunrisers: త్వరలోనే ఐపీఎల్ 2022 సంగ్రామం జరుగబోతుంది. మొత్తం పది జట్లు పాల్గొనేలా ఐపీఎల్ నిర్వాహాకులు ప్లాన్ చేస్తున్నారు. గత ఐపీఎల్ మ్యాచులతో పోలిస్తే మరింత రసవత్తరంగా మ్యాచులను తీర్చిదిద్దేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే జనవరిలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలంపాటలకు బీసీసీఐ సమాయత్తం అవుతోంది.

Sunrisers Hyderabad

ఐపీఎల్ మెగా వేలంపాటలకు ముందే ఆయా ప్రాంచైజీ జట్లు కీలక ఆటగాళ్లను అంటిపెట్టుకునే  అవకాశం నేటితో ముగిసింది. గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను ఆయా జట్లు తమతో ఉంచుకునే వెలుసుబాటు ఉంది. ముంబాయి, చైన్నె, ఢిల్లీ, కొలకత్తా జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.

బెంగళూరు, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు మాత్రం ముగ్గురిని రిటైన్ చేసుకోగా పంజాబ్ మాత్రం ఇద్దరిని తమతో ఉంచుకుంది. ఆయా జట్టు కీలక ప్లేయర్స్ మాత్రం తమతో ఉంచుకోగా సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం కీలక ప్లేయర్స్ ను వదులుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై క్రికెట్ లవర్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సన్ రైజర్స్ యాజమాన్యం విలియమ్స్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ లను రిటైన్ చేసుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ను వదులుకున్న సన్ రైజర్స్ అప్ఘనిస్తాన్ కు చెందిన కీలక ఆటగాడు రషీద్ ఖాన్ ను ఎందుకు రిటైన్ చేసుకోలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: ఆటగాళ్లందరినీ వదలుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. సంచలన నిర్ణయానికి కారణమిదే!

సన్ రైజర్స్ జట్టును ముందుండి నడిపించే వార్నర్‌ ను వదిలేశారని ఇప్పటికే కారాలు మిరాయాలు నూరుతున్న తెలుగు ఫ్యాన్స్ రషీద్‌ ఖాన్‌ లేకపోవడంపై మరింత గుర్రుగా ఉన్నారు. సన్ రైజర్స్ యాజమాన్యంపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే రషీద్ ఖాన్ లక్నో జట్టుతో బేరసారాలు చేసుకొని సన్ రైజర్స్ ను వదులుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.

తనకు తొలి ప్లేయర్ గా ప్రాధాన్యం ఇస్తూ రూ.16కోట్లు ఇవ్వాలని సన్ రైజర్స్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశాడట. దీంతో సన్ రైజర్స్ చేసేదేమీలేక రషీద్ ను రిటైన్ చేసుకోలేదని తెలుస్తోంది. అయితే కీలక ప్లేయర్స్ అయిన వార్నర్, రషీద్ ను సన్ రైజర్స్ వదులుకోవడంపై మాత్రం ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మరీ వేలంపాటలోనైనా సన్ రైజర్స్ కీలక ఆటగాళ్లను దక్కించుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే..!

Also Read: ‘అయ్యర్’ కోసం అతడిపై వేటు పడనుందా?