https://oktelugu.com/

Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ తాత ఇఫ్తికర్ ఆలీ ఖాన్ ఇండియాలో ఉంటూ ఇంగ్లాండ్ టీమ్ లో క్రికెట్ ఎందుకు ఆడాడు..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే అక్కడ చాలా మంచి ఇమేజ్ అయితే దక్కుతుంది. ఒకప్పుడు నెంబర్ వన్ ఇండస్ట్రీ గా ముందుకు సాగిన బాలీవుడ్ ఇప్పుడు కొంతవరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి. షారుక్ ఖాన్(Sharukh Khan), సల్మాన్ ఖాన్(Salman Khan),అమీర్ ఖాన్ (Ameer Khan) లాంటి ఖాన్ త్రయం మంచి విజయాలను అందుకొని ఇండస్ట్రీ ని ఒక రేంజ్ లోకి తీసుకెళ్లారు. ఇక వీళ్ళతో పాటుగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కూడా చాలా వరకు బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ సినిమాలను సక్సెస్ చేయడంలో ఆయన కూడా కీలక పాత్ర వహిస్తూ వచ్చాడు...

Written By: , Updated On : January 18, 2025 / 02:34 PM IST
Saif Ali Khan's grandfather Iftikhar Ali Khan

Saif Ali Khan's grandfather Iftikhar Ali Khan

Follow us on

Saif Ali Khan : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటులు స్టార్ హీరోలుగా వెలుగొందటమే కాకుండా భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు… ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) లాంటి నటుడు సైతం మంచి పాత్రలను ఎంచుకొని రాణిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఆయన బాలీవుడ్ (Bolywood) లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే గత రెండు రోజుల క్రితం ఆయన ఇంట్లో ఆయనే మీద గుర్తు తెలియని దుండగుడు ఒకడు కత్తితో దాడి చేసిన విషయం మనకు తెలిసిందే.

ఆరు సార్లు ఆయనను కత్తి తో పొడిచాడు. ప్రస్తుతం అయితే ఆయన చాలా సేఫ్ గా ఉండటమే కాకుండా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ నిదానంగా కోలుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా తన మీద ఇలాంటి ఒక అటాక్ జరగడం అనేది ప్రతి ఒక్కరిని బాధ పెడుతుందనే చెప్పాలి… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ‘సైఫ్ అలీ ఖాన్’ వాళ్ళ తాత అయిన ‘ఇఫ్తికర్ అలీ ఖాన్’ ఇండియాలో హర్యానా రాజ్యంలో 8వ నవాబుగా కొనసాగుతూనే ఆయన ఇంగ్లాండ్ టీమ్ వైపు క్రికెట్ మ్యాచ్ లను ఆడాడు నిజానికి అప్పుడు ఇండియా మొత్తం బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉంది.

కాబట్టి ఇండియన్ ప్లేయర్లు కూడా చాలా మంది వాళ్ళ టీమ్ లో ఆడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక 1932 వ సంవత్సరంలో ‘ఇఫ్తికర్ అలీ ఖాన్’ ఇంగ్లాండ్ టీమ్ తరఫున క్రికెట్ ఆడాడు. కొద్దిరోజుల పాటు ఆయన క్రికెట్ ఆడిన తర్వాత ఒక యాక్సిడెంట్ లో ఆయనకి తీవ్రమైన గాయాలు అవ్వడంతో క్రికెట్ కి దూరం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది…

మరి ఏది ఏమైనా కూడా ‘సైఫ్ అలీ ఖాన్’ వాళ్ళ తాత బ్రిటిష్ వాళ్లకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు. తద్వారా ఆయన ఆ టీమ్ లో క్రికెట్ ఆడడానికి ప్లేస్ అయితే సంపాదించుకున్నాడు… ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఏది ఏమైనా కూడా ‘సైఫ్ అలీ ఖాన్’ ప్రస్తుతం ఇండియన్ నటుడిగా రాణిస్తూ ఉండడమే కాకుండా ఒకసారి నేషనల్ అవార్డును కూడా అందుకోవడం విశేషం…