1999 India Pakistan match : ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవరు ఎన్ని మ్యాచ్ లు ఆడిన కూడా ఎప్పటికైనా ఒక మ్యాచ్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. అది ఏ మ్యాచ్ అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ అనే చెప్పాలి. ఈ రెండు దేశాలు మధ్య ఎప్పుడు ఏ ఫార్మాట్లో మ్యాచ్ జరిగిన మొత్తం అందరి దృష్టి ఈ మ్యాచ్ మీదనే ఉంటుంది.అందరూ ఈ మ్యాచ్ ని మొదటి నుంచి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఐసీసీ గాని, ఎసిసి గాని వీళ్ల మీదనే ఎక్కువ మ్యాచ్ లు అనేవి వచ్చేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వాటి వల్లే వాళ్లకి ఎక్కువ రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది ఇక ఇలాంటి సమయంలో మొన్న జరిగిన ఏషియా కప్ ని పాకిస్తాన్ లో నిర్వహించాల్సి ఉంది.కానీ బిసిసిఐ పాకిస్థాన్ లో ఏషియా కప్ నిర్వహిస్తే మేము మా ప్లేయర్లని పాకిస్తాన్ కి పంపించము అని చేసిన వ్యాఖ్యలకి ఏసీసీ ఆ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంక కి మార్చడం జరిగింది.
ఇక మన వాళ్ళు శ్రీలంక వెళ్లి ఆసియా కప్ ఆడి కప్పు గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే… అయితే 1991 వ సంవత్సరంలో పాకిస్తాన్ ఇండియా మధ్య వాంఖడే స్టేడియంలో జరగాల్సిన ఒక మ్యాచ్ కి మూడు రోజుల ముందు శివసేన కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు స్టేడియంలోకి వెళ్లి పిచ్ ని తవ్వి ఆ పిచ్ మొత్తాన్ని కిరోసినాయిల్ పోసి నిప్పంటించడం జరిగింది.వాళ్ళు అలా ఎందుకు చేశారు అంటే బార్డర్ లో మన సైనికులని వీళ్ళు హతమారుస్తుంటే మీరు మాత్రం వాళ్ళని మన దేశం లోకి తీసుకువచ్చి మ్యాచ్ లు ఆడుతున్నారు.
దేశం యుద్ధం చేస్తుంటే మీరు మాత్రం వాళ్లతో ఆటలాడుతున్నారు అని ఆ పార్టీ వ్యక్తులు తీవ్రమైన అసహనాన్ని వెలుబుచ్చారు. ఇక దాంతో మొదటి టెస్ట్ ముగిసిన తర్వాత ఆ సిరీస్ మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది. ఇక 1999వ సంవత్సరంలో మరోసారి ఇండియా పాకిస్తాన్ టీమ్ లా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది దానికి ముందే శివసేన వాళ్లు ఈ మ్యాచ్ ని జరగకుండా మేము అడ్డుకుంటాం అంటూ ఓపెన్ గా సవాళ్లు చేశారు. దానికోసం అని మేము గ్రౌండ్ లో మ్యాచ్ జరగకుండా ఉండడానికి పాములను కూడా వదులుతామంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి బిసిసిఐ ఎలాగైనా ఈ మ్యాచ్ ని అడ్డంకి లేకుండా జరపాలని అనుకొని ముందుకు సాగింది.
ఇక అందులో భాగంగానే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్ లో కొంతమంది పాములు పట్టే వాళ్ళని పెట్టి మరి ఈ మ్యాచ్ ని ఏ అడ్డంకి లేకుండా బీసీసీఐ నిర్వహించడం జరిగింది. అలా ఒక మ్యాచ్ కోసం వేరే వ్యక్తులకు భయపడి గ్రౌండ్ లో పాములు పట్టే వాళ్లను పెట్టడం అదే మొదటిసారి కానీ బీసీసీఐ ఆ మ్యాచ్ కి ఏ అడ్డంకి లేకుండా ఈ మ్యాచ్ ని ఫినిష్ చేసి శివసేన వాళ్లు విసిరిన సవాళ్లను తిప్పికొట్టింది…అలా ఒక మ్యాచ్ కోసం బిసిసిఐ గ్రౌండ్ లో పాములు పట్టే వాళ్ళని పెట్టి ఇలా మ్యాచ్ లు ఆడించడం అప్పట్లో ట్రెండింగ్ గా నిలిచిందనే చెప్పాలి…