Jasprit Bumrah : ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు దక్కింది. జస్ ప్రీత్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ను ఎంపిక చేసామని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చెప్పగానే.. ఒక్కసారిగా సంచలనం నమోదయింది. వాస్తవానికి కొంతకాలం నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. అతడు పూర్తిస్థాయిలో కోలుకున్నాడని.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడని ప్రచారం జరిగింది. బిసిసిఐ సెలక్షన్ కమిటీ కూడా ఇదే దిశగా సంకేతాలు ఇచ్చింది. కానీ అతడు ఆడటంలేదని.. పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించలేకపోతున్నాడని చెబుతూ బిసిసిఐ ఎలక్షన్ కమిటీ.. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ను ఎంపిక చేసింది. 2022లో బుమ్రా లోయర్ బ్యాక్ సర్జరీ చేయించుకున్నాడు. ఇటీవల సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. చివరికి వెన్ను నొప్పి అతడికి మళ్ళీ తిరగబెట్టడంతో.. 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసి.. డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోయాడు. నాటి నుంచి అతడికి టీమిండియా మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది.. మధ్యలో న్యూజిలాండ్ దేశం నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్ట్ బుమ్రా ను పరిశీలించాడు.. ఆ తర్వాత బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. ప్రస్తుతం అతడు అక్కడే చికిత్స పొందుతున్నాడు. అయితే ఇటీవల ఇంగ్లాండ్ తో మొదలైన వన్డే సిరీస్లో బుమ్రా కు చోటు లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బుమ్రా పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించకపోవడంతో పక్కన పెట్టారు. మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ లో ఆడే భారత జట్టులో బుమ్రా కు ప్రారంభంలో చోటు కల్పించారు. అయితే అతడికి వెన్నునొప్పి గాయం ఇంకా తగ్గకపోవడంతో.. అతడి స్థానంలో హర్షిత్ కు స్థానం కల్పించారు.
ఫిట్ గా ఉన్నప్పటికీ..
బుమ్రా ఫిట్ గా ఉన్నప్పటికీ.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. “బుమ్రా ఫిట్ గానే ఉన్నాడు. కాకపోతే అజిత్ అగార్కర్ అతడిని ఎంపిక చేయలేదు. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బు మ్రా స్థానంలో హర్షిత్ ను ఎంపిక చేశారు. యశస్వి జైస్వాల్ స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. 2022లో బుమ్రా లోయర్ బ్యాక్ సర్జరీ చేయించుకున్నాడు.. మళ్లీ ఆ గాయం తిరగబెట్టింది. అయితే ఇప్పుడు అతడు పూర్తిస్థాయిలో ఫిట్ గా ఉన్నప్పటికీ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని” తన కథనాలలో జాతీయ మీడియా పేర్కొంది. అయితే బుమ్రా గతంలో సర్జరీ చేయించుకోవడం.. అది ఇటీవల తిరగబెట్టడం.. వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అజిత్ అగార్కర్.. రిస్క్ ఎందుకని బుమ్రా ను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. ” బుమ్రా కోలుకున్నప్పటికీ అతడికి మళ్ళీ గాయం తిరగబెట్టే ప్రమాదం లేకపోలేదు. సిడ్నీ టెస్టులో మళ్లీ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు రిస్క్ ఎందుకని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని” మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.