CSK vs LSG : లక్నో వర్సెస్ చెన్నై.. చేపాక్ సమరంలో గెలిచేదెవరో?

చెన్నై మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. ఈ మైదానంపై పచ్చిక అధికంగా ఉండడంతో బంతి ఊరికే మెలికలు తిరుగుతుంది. అంతేకాదు ప్రారంభంలో పేస్ బౌలింగ్ ఎదుర్కోవడం కూడా బ్యాటర్ లకు కష్టమే.

Written By: NARESH, Updated On : April 23, 2024 2:52 pm

LSG vs CSK

Follow us on

CSK vs LSG :  పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది చెన్నై. సరిగ్గా నాలుగు రోజుల కిందట రెండు వరుస విజయాలు సాధించి చెన్నై జట్టు అమితమైన విశ్వాసంతో ఉంది. కానీ, ఆ జట్టు లక్నోలో అడుగుపెట్టగానే ఓటమి చవిచూసింది. రాహుల్ ఆధ్వర్యంలో లక్నో టీం అత్యంత సులభంగా ఆ మ్యాచ్ గెలిచింది. ఈ క్రమంలో ఈ రెండు జట్లు మంగళవారం చెన్నై వేదికగా చేపాక్ మైదానంలో మరోసారి తలపడనున్నాయి. చెన్నైకి సొంత మైదానం అంటే బంగారు బాతు గుడ్డు లాంటిది.. ఇప్పటికే లక్నో చేతిలో ఒకసారి ఓడిపోయింది. మరి ఈసారి చెన్నై పుంజుకుంటుందా? లక్నో మొన్నటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా.? మరి కొద్ది గంటల్లో తేలనుంది.

చెన్నై

చెన్నై జట్టు ప్రయాణం ఈ సీజన్లో నల్లేరు మీద నడక కాకపోయినప్పటికీ.. ఆ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ -4 స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్లు రచిన్ రవీంద్ర, సమీర్ రిజ్వి పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో రచిన్ రవీంద్ర అనవసరంగా వికెట్ సమర్పించుకుంటున్నాడు. సమీర్ రిజ్వి కూడా నేరుగా ఆడలేక పోతున్నాడు. మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, అజింక్య రహనే, రుతు రాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. మిగతావాళ్లు టచ్ లోకి రావాలని చెన్నై జట్టు భావిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో తుషార్ దేశ్ పాండే అంతగా రాణించడం లేదు. ముస్తాఫిజుర్ అహ్మద్ ప్రారంభ మ్యాచ్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ, ఇప్పుడు విపరీతంగా పరుగులు ఇస్తున్నాడు. దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, పతిరన మాత్రమే ఆకట్టుకుంటున్నారు. అయితే వీరి నుంచి మరింత మెరుగైన ప్రదర్శనను చెన్నై జట్టు ఆశిస్తోంది. ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో డికాక్ ఇచ్చిన క్యాచ్ ను చెన్నై ఆటగాళ్లు నేలపాలు చేశారు. దీంతో చెన్నై జట్టు ఓడిపోవాల్సి వచ్చింది.

లక్నో

రాహుల్ నాయకత్వంలో లక్నో జట్టు సమిష్టిగా ఆడుతోంది. సీనియర్ పేస్ బౌలర్ లేకపోయినప్పటికీ కుర్రాళ్ళు అదరగొడుతున్నారు. ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో మోసిన్ ఖాన్, హెన్రీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా వంటి వారు స్పిన్ బౌలింగ్ తో అలరిస్తున్నారు. చెన్నై మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. అలాంటప్పుడు రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా బౌలింగ్ కీలకంగా మారుతుంది. ఇక గత మ్యాచ్లో కెప్టెన్ క్వింటన్ డికాక్ అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా తన పూర్వపు లయను అందుకున్నాడు. పూరన్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఆయుష్ బదోని కూడా పరవాలేదనిపిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో మయాంక్ యాదవ్ కనుక ఆడితే లక్నో జట్టు బౌలింగ్ బలం పెరుగుతుంది.

చెన్నై మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. ఈ మైదానంపై పచ్చిక అధికంగా ఉండడంతో బంతి ఊరికే మెలికలు తిరుగుతుంది. అంతేకాదు ప్రారంభంలో పేస్ బౌలింగ్ ఎదుర్కోవడం కూడా బ్యాటర్ లకు కష్టమే. టాస్ నెగ్గిన జట్టు రెండో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకుంటుంది. మరోవైపు చేపాక్ మైదానంలో చెన్నై జట్టుకు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ సీజన్లో ఈ మైదానంపై మూడు మ్యాచ్ లు ఆడితే.. మూడింటిలోనూ చెన్నై గెలిచింది.

తుది జట్లు ఇలా..

చెన్నై

రుతు రాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, మహేంద్ర సింగ్ ధోని, అజంక్య రహానే, మతిషా పతిరన, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, మోయిన్ అలీ, ముస్తాఫిజుర్ అహ్మద్.

లక్నో

కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, యశ్ ఠాకూర్, మోసిన్ ఖాన్, రవి బిష్ణోయ్ , నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, హెన్రీ.