https://oktelugu.com/

Anchor Rashmi: డాన్సర్ పండు చేసిన పనికి అందరి ముందే వెక్కివెక్కి ఏడ్చిన యాంకర్ రష్మీ… ఏం జరిగింది?

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. హైపర్ ఆది, నాటి నరేష్ ల కామెడీ బాగా పండింది. వీళ్లిద్దరి మధ్య సంభాషణలు నవ్వులు పూయించాయి.

Written By: , Updated On : April 23, 2024 / 02:29 PM IST
Anchor Rashmi Gets Emotional On Stage

Anchor Rashmi Gets Emotional On Stage

Follow us on

Anchor Rashmi: రష్మీ గౌతమ్ టాప్ యాంకర్స్ లో ఒకరిగా బుల్లితెరపై హవా సాగిస్తుంది. నటిగా కెరీర్ ప్రారంభించిన రష్మీ జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ ఫేమ్ హీరోయిన్ కావాలన్న ఆమె కల నెరవేరేలా చేసింది. గుంటూరు టాకీస్, రాజుగారి బంగ్లా, నెక్స్ట్ నువ్వే, అంతకు మించి వంటి చిత్రాల్లో రష్మీ లీడ్ హీరోయిన్ రోల్స్ చేసింది. కానీ ఒక్క సినిమా కూడా సరైన హిట్ ఇవ్వలేదు. దాంతో యాంకరింగ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తుంది.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. హైపర్ ఆది, నాటి నరేష్ ల కామెడీ బాగా పండింది. వీళ్లిద్దరి మధ్య సంభాషణలు నవ్వులు పూయించాయి. ఈ ఎపిసోడ్లో రష్మీ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ నెల 27న రష్మీ గౌతమ్ తన పుట్టిన రోజు జరుపుకోబోతుంది. 28న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. కాబట్టి రష్మీ తన బర్త్ డే శ్రీదేవి డ్రామా కంపెనీ షో వేదికగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పండు మాస్టర్ ఆమెకు తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో విషెస్ తెలియజేసాడు. రష్మీ ఇంప్రెస్ అయ్యేలా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. అనంతరం ఓ స్పెషల్ గిఫ్ట్ రష్మీ గౌతమ్ కి ప్రజెంట్ చేసాడు. సదరు గిఫ్ట్ చూసిన రష్మీ తీవ్ర భావోద్వేగానికి గురైంది. కంట్రోల్ చేసుకోలేక స్టేజ్ మీదే ఏడ్చేసింది. రష్మీ గౌతమ్ పెట్ డాగ్ కుక్క చుట్కి గౌతమ్ ఫోటోను పండు బహుమతిగా ఇచ్చాడు. ఇటీవల అనారోగ్యంతో చుట్కి గౌతమ్ చనిపోయిన సంగతి తెలిసిందే.

ఆ కుక్క అంటే రష్మీ కి చాలా ప్రేమ. అది మరణించడంతో దానికి దహన సంస్కారం కూడా చేసింది. తనకు శాశ్వతంగా దూరమైన పెంపుడు కుక్కను ఫోటో చూసి ఎమోషనల్ అయ్యింది. తాను ఏదైనా బాధతో రాత్రి వేళ ఏడుస్తూ కూర్చుంటే .. చుట్కి తన పక్కనే వచ్చి కూర్చునేదని రష్మీ గుర్తు చేసుకుంది. రష్మీ కి మూగజీవాలపై ప్రేమ ఎక్కువ. వాటి రక్షణ కోసం ఆమె పోరాడుతున్నారు.
Summer Holidays Sridevi Drama Company Latest Promo -  28th April 2024 in #Etvtelugu - Rashmi Gautam