Stephen Fleming Exits CSK: ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. అని సందర్భాల్లో కూడా చెన్నై జట్టుకు సారధిగా వ్యవహరించాడు మహేంద్ర సింగ్ ధోని. చెన్నై జట్టుకు మహేంద్ర సింగ్ ధోని గుండెకాయ లాంటి వాడు అయితే.. అతడు వెన్నెముక లాగా నిలిచాడు.
చెన్నై జట్టులోకి సరిగా 2008లో ఒక సాధారణ ఆటగాడిగా వచ్చాడు.. 2009లో శిక్షకుడిగా మారాడు. అతడి శిక్షణలో చెన్నై జట్టు రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎంతలా అంటే చెన్నై జట్టు ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిచేలా.. మామూలు ప్లేయర్లను కూడా మ్యాచ్ విన్నర్లుగా మలిచాడు ఆ శిక్షకుడు. చెన్నై సూపర్ కింగ్స్ లో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. అంతటి అనితర సాధ్యమైన ఘనత సాధించిన ఆ శిక్షకుడు ఇప్పుడు చెన్నై జట్టు నుంచి వెళ్లిపోయాడు.
అంతటి స్థాయి ఘనత అందుకున్న ఆ కోచ్ పేరు ఫ్లెమింగ్. న్యూజిలాండ్ జట్టులో అద్భుతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఫ్లెమింగ్. న్యూజిలాండ్ జట్టుకు అటాకింగ్ ఆట తీరు నేర్పించి.. సిసలైన సారధిగా ఆవిర్భవించాడు. అయితే అతడు సుదీర్ఘకాలంగా చెన్నై జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.. అయితే ఇప్పుడు తన బాధ్యతల నుంచి అతడు తప్పుకున్నాడు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ప్రకటించింది.. 2008లో ఆటగాడిగా చెన్నై జట్టులో ప్రవేశించాడు ఫ్లెమింగ్. 2009 నుంచి హెడ్ కోచ్ గా సేవలు అందించడం మొదలుపెట్టాడు.
గడచిన 18 సంవత్సరాలు కాలంలో ఫ్లెమింగ్ చెన్నై జట్టుకు ఐదు ఐపీఎల్ టైటిల్స్.. రెండు ఛాంపియన్స్ లీగ్ విజయాలు అందించాడు.. అంతేకాదు, సాధారణ ప్లేయర్లను కూడా అతడు సూపర్ స్టార్లు గా మార్చాడు. మ్యాచ్ విన్నర్లను చేశాడు. చివరికి సుదీర్ఘకాలం పనిచేసి.. జట్టు నుంచి తప్పుకున్నాడు.. అతడు చేసిన సేవలపట్ల చెన్నై యాజమాన్యం సంతృప్తి వ్యక్తం చేసింది. థాంక్యూ ఫ్లెమింగ్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ విడుదల చేసింది.చెన్నై జట్టు నుంచి వెళ్లిపోయిన తర్వాత ఫ్లెమింగ్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ కోచ్ గావెళ్లే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంతవరకు ఫ్లెమింగ్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని.. ఆ తర్వాత వేరే ప్రయాణం మొదలు పెడతారని సమాచారం.
