AP MLC Elections: ఏపీలో( Andhra Pradesh) మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తో పాటు కృష్ణా- గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నేరుగా ఓటర్లను కలిసి అభ్యర్థిస్తున్నారు. రెండు పట్టభద్రుల స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. బిజెపితో పాటు జనసేన మద్దతు తెలిపాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. తెలుగుదేశం ప్రత్యర్థులకు మద్దతు ప్రకటించింది. దీంతో పోటీ రసవత్తరంగా జరగనుంది.
* ముమ్మర ఏర్పాట్లు
ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల( MLC elections) ఓటర్ల జాబితాలో ఓ విచిత్రం వెలుగు చూసింది. ఒకే వ్యక్తి పేరుతో ఏకంగా 42 ఓట్లు జాబితాలో కనిపించడం సంచలనంగా మారింది. కృష్ణా- గుంటూరు కొత్త పుత్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఇలా ఒకే వ్యక్తి పేరుతో 42 ఓట్లు ఉండడం విచిత్రంగా మారింది. అయితే ఆ వ్యక్తి వయస్సు, ఇంటిపేరు, డోర్ నెంబర్లు, తండ్రి పేరు, బూత్ ల వివరాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. దీంతో పిడిఎఫ్ అభ్యర్థికి చెందిన మద్దతుదారులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని గురజా ప్రకాష్ రాజు పేరుతో ఈ దరఖాస్తులు ఉన్నాయి. ఇంతకీ ఈ ప్రకాష్ రాజ్ ఎవరో తెలియక అభ్యర్థుల ప్రతినిధులు కూడా అవాక్కయ్యారు. ఇలా ఒకే వ్యక్తి పేరుతో ఏకంగా 42 ఓట్లు ఉండడం విశేషం.
* ఓటర్ల జాబితా ప్రకటన
మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ( graduate MLC elections) ఎన్నికలకు సంబంధించి అధికారులు ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఈ ఓటర్ల జాబితా సార్వత్రిక ఎన్నికల ఓట్ల జాబితాకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఓటుకు దరఖాస్తు చేసుకున్న వారు తమ ఓటు ఉందా? లేదా? ఏ పోలింగ్ కేంద్రంలో? ఏ బూత్ లో? ఏ సీరియల్లో ఉందో ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటర్ల గూగుల్ బ్రౌజర్ లో ఏపీ ఎన్నికల వెబ్సైట్ https///ceoandhra.nic.in ను ఓపెన్ చేయాలి. అక్కడ కుడి వైపు ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ 2014 అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే నాలుగు ఆప్షన్లు వస్తాయి. వాటిలో చివరి ఆప్షన్ సెర్చ్ యువర్ నేమ్ ను క్లిక్ చేయాలి. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీలకు సంబంధించిన వివరాలతో పేజీ కనిపిస్తుంది. వాటిలో గ్రాడ్యుయేట్స్ కృష్ణా, గుంటూరు ఎంపిక చేయగానే ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్నప్పుడు ఓ ఐ డి ఉంటుంది. అలా ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. పేరు/ ఇంటి నెంబర్ నమోదు ద్వారా కూడా తెలుసుకోవచ్చు.