India Team: ఇండియన్ టీమ్ విజయం వెనకాల కనిపించని ఆ వ్యక్తి ఎవరంటే..?

ఈయన ఇండియన్ ప్లేయర్లు నెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు త్రో బాల్స్ వేస్తూ ప్లేయర్లను ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ వేస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విధంగా నెట్ ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాడు.

Written By: Gopi, Updated On : November 6, 2023 12:57 pm
Follow us on

India Team: ఇండియన్ క్రికెట్ టీం సక్సెస్ వెనక ఇండియన్ ప్లేయర్ల కష్టం ఉంటుంది వాళ్లు మనకు కనిపిస్తూ మ్యాచ్ ను ఆడుతూ విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కానీ డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి దిగకుండ, మ్యాచ్ ని ఆడకుండా ప్లేయర్లు ఎలా ఆడితే మ్యాచ్ గెలుస్తుంది అనే సజెషన్స్ ఇస్తూ ప్లేయర్లకి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ గా ఉంటూ ఎలాంటి రీతిలో ఆడితే మ్యాచ్ గెలుస్తాము అనే సలహాలను అందిస్తూ మ్యాచ్ లను గెలుపు తీరాలకి చేర్చే కోచ్ లు గానీ , సలహాదారులు గానీ చాలామంది ఉంటారు. ఇలాంటి క్రమంలోనే డి రాఘవేంద్ర అలియాస్ రఘు అని పిలిచే ఒక వ్యక్తి ఇండియన్ టీం విజయాల వెనుక చాలా కీలకపాత్ర పోషిస్తున్నాడనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు…

ఈయన ఇండియన్ ప్లేయర్లు నెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు త్రో బాల్స్ వేస్తూ ప్లేయర్లను ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ వేస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విధంగా నెట్ ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాడు.మరి ముఖ్యంగా రఘు ఇండియన్ టీం మ్యాచ్ లు గెలవడంలో తన కాంట్రిబ్యూషన్ అనేది వెలకట్టలేనిది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాంటి ఒక దిగ్గజ ప్లేయర్ కి సైతం 2013, 2014, 2015 టైంలో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఆయన కొంతవరకు తడబడినట్టు కనిపించిన సమయంలో రఘు నెట్ ప్రాక్టీస్ లో కంటిన్యూస్ గా 155 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో బాల్స్ వేస్తూ కోహ్లీ ఫాస్ట్ బౌలర్లను దీటుగా ఎదుర్కొనేలా తయారు చేశాడు. ప్రతి బాల్ కి వేరియేషన్ ని చూపిస్తూ ఇండియన్ టీం ని బలంగా తయారు చేయడంలో ఆయన సాధించిన ఘనత అమోఘం అనే చెప్పాలి.

అందుకే ట్రోఫీలు గెలుచుకున్న ప్రతిసారి ఇండియన్ టీం ప్లేయర్లు అతన్ని పిలిచి అతనికి చేతిలో కప్పు పెడతారు…ఆయన గురించి కోహ్లీ స్వయంగా మాట్లాడుతూ నేను ఫాస్ట్ బౌలింగ్ ఆడడంలో కొంతవరకు తడపడినప్పుడు రఘునే నాకు దగ్గరుండి ఒక అద్భుతమైన మోరల్ సపోర్ట్ ఇస్తూ నేను ఎలా ఆడాలి అనే దానిమీద చాలా బాగా చెప్పేవాడు అని చెప్పాడు. ఇక రీసెంట్ గా వరల్డ్ కప్ లో ఇండియా న్యూజిలాండ్ మీద ఆడిన మ్యాచ్ లో కూడా రఘు తన కాంట్రిబ్యూషన్ ని అందించాడు ఎలా అంటే ఆ మ్యాచ్ ఆడుతున్న ధర్మశాల పిచ్ కండిషన్ అంత బాగాలేదు దాంతో ప్లేయర్ల షూస్ కి అంటుకున్న సొయిల్ వల్ల ప్లేయర్లు పరిగెత్తడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే వాళ్ళు డైవ్ చేసినపుడు ఇంజురీస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది అని గమనించిన రఘు ఇండియన్ ప్లేయర్ల షూస్ ని బ్రెష్ తో క్లీన్ చేశాడు.

అందుకే ఆ విషయంలో రఘు కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉందని తర్వాత ప్లేయర్లు కూడా చెప్పడం విశేషం…ఇలా ఇండియన్ టీం కి తనదైన సేవలు అందిస్తున్న రఘు ఎవరికి కనపడని విజేతగా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తన పేరుని నమోదు చేసుకున్నాడు… వరల్డ్ కప్ లో ఇండియన్ ప్లేయర్లు ఇంత బాగా ఆడడానికి ఆయన కాంట్రిబ్యూషన్ చాలా వరకు ఉంది…